యూఎస్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి.. | Major Changes in US Visa and H-1B program From 1st January 2025 | Sakshi
Sakshi News home page

యూఎస్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..

Published Mon, Dec 23 2024 7:48 AM | Last Updated on Mon, Dec 23 2024 8:22 AM

Major Changes in US Visa and H-1B program From 1st January 2025

చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. 

త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్‌మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్‌మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.

హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులు
యూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.

2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.

సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులు
ఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్‌లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.

ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు

మార్పులు ఎందుకంటే?
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement