తత్కాల్ పథకం కింద పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. ఇకపై ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల అటెస్టేషన్ లేకుండానే పాస్‌పోర్టు పొందవచ్చు. ఆధార్/ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు కేంద్రం సూచించి న 12 రకాల పత్రాల్లో ఏవైనా రెండు జత చేసి పాస్‌పోర్టు రుసుము రూ.1,500, అదనంగా తత్కాల్ రుసుము రూ.2 వేలు చెల్లిస్తే మరుసటి రోజు నుంచి గరిష్టంగా 3 రోజుల్లోగా పాస్‌పోర్టు జారీ కానుంది