జిల్లా వాసులు పాస్‌పోర్టు సేవలు సులభంగా పొందేందుకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది.
నెల్లూరు (సెంట్రల్) : జిల్లా వాసులు పాస్‌పోర్టు సేవలు సులభంగా పొందేందుకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. పాస్‌పోర్టు సేవలను నెల్లూరులోనే పొందేందుకు వీలుగా మేళా నిర్వహించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్‌ను ఎంపీ మేకపాటి కోరారు.
దీనికి స్పందించిన ఆమె నెల్లూరులో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు అంగీకరించారు. శనివారం నగరంలోని జెడ్పీ హాలులో ఉదయం నుంచి ఈ పాస్‌పోర్టు మేళా జరగనుంది. ఆన్‌లైన్‌లో స్పాట్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ఈ అవకాశం ఉంటుంది. ఈ పాస్‌పోర్టు మేళాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొనున్నారు.