చేజర్ల, న్యూస్‌లైన్: ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేయనున్న యువ నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆదరించాలని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విన్నవించారు. మండలంలోని కాకివాయి, కండాపురం, నాగలవెలటూరు, యర్రబల్లి గ్రామాల్లో ఆదివారం గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశానుసారం గౌతమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు.
పట్టుదల, దృఢసంకల్పం ఉన్న యువనేత గౌతమ్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. చేజర్ల మండలంలో ఇంత ప్రజాస్పందన వస్తుందని ఊహించలేదన్నారు. ఏ మారుమూల గ్రామానికి గౌతమ్ వెళ్లినా హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారన్నారు. నాలుగు నెలల్లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి పేదలను నిరాశ్రయులను చేసిందని విమర్శించారు. జగన్ పాలనలో వైఎస్సార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు.
సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్న జగన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఏర్పడే సమస్యలు కేంద్రానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, నాయకులు ఎస్‌డీ నా యబ్, ఎస్‌కే వహీద్‌బాషా, సానా వేణుగోపాల్‌రెడ్డి, బూదళ్ల వీరరాఘవరెడ్డి, బాలిరెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
యువ నాయకుడిని ఆదరించండి
Published Mon, Jan 20 2014 5:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement