
నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరముందన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి రావాలని కోరారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైఎస్సార్ సీపీ చేరుతానని వెల్లడించారు.
పార్టీ మారే అంశంపై చర్చించడానికి జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో రామ్‌కుమార్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అభిమానులు వైఎస్సార్ సీపీలోకి చేరాలని ఒత్తిడి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment