nedurumalli ramkumar reddy
-
చంద్రబాబు, నారా లోకేష్ కు నేదురుమల్లి మాస్ వార్నింగ్
-
ఇచ్చిన హామీలను కూటమి అమలు చేయాలి
-
బస్సుయాత్రను విజయవంతం చేస్తాం- రాంకుమార్ రెడ్డి
-
షర్మిలపై నేదురుమల్లి సంచలన వ్యాఖ్యలు
-
అవ్వా పింఛన్ అందుతుందా?
రాపూరు: అవ్వా పింఛన్ అందుతుందా? అని వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఓ వృద్ధురాలిని అడిగారు. ఇంటికే తెచ్చి ఇస్తున్నారు నాయనా.. అని పుల్లంపుత్తూరు సుబ్బమ్మ సమాధానమిచ్చింది. అలాగే ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చి చూస్తున్నారా? పరీక్షలు చేస్తున్నారా? అని అచ్చం సంజీవమ్మను అడగ్గా.. ఆరోగ్యసిబ్బంది ఇంటికే వచ్చి రక్తపరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి ఎటువంటి కష్టం లేకుండా చూస్తున్నారు. ఆయన్ను భగవంతుడు చల్లగా చూడాలి.. అని సమాధానమిచ్చారు. ఈ సంభాషణలు మంగళవారం పె నుబర్తిలో జరిగిన గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. -
ఆనం రాంనారాయణరెడ్డికి నేదురుమల్లి ఛాలెంజ్
-
ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్ కామెంట్స్
సాక్షి, నెల్లూరు: ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్‌ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు) -
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం లక్ష్యంగా తన వంతు పనిచేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, ముఖ్యనేతల సమన్వయంతో సమష్టిగా పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కోటనరవలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ రామ్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితో పాటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేదురుమల్లి వర్గీయులు పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి నేదురుమల్లి వర్గీయులు భారీ ర్యాలీగా విశాఖ జిల్లాకు చేరుకున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి ముఖ్య అనుచరులు దామోదర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ద్వారకానా«త్, సుధాకర్‌నాయుడు, రామయ్యనాయుడు, ఎల్ కోటేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోసం జనం ఎదురు చూపు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం 13 జిల్లాల్లోని ప్రజలు ఎదురు చూస్తున్నారని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పూర్వకాలంలో రాజులు దేశాటన చేసి పరిస్థితులను అవగతం చేసుకుని పట్టాభిషిక్తులు అయిన తర్వాత ఆ దేశ ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకునే వారన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు నమ్మకం, అభిమానం ఉన్నాయని, అవే ఆయన్ను పట్టాభిషిక్తుడిని చేస్తాయని తెలిపారు. గతంలో అనుభవజ్ఞుడన్న కారణంతో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారని, ఆయన అన్నీ వర్గాలను వంచించారని తెలిపారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. నేదురుమల్లి అభిమానుల అభీష్టం మేరకు వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, నేదురుమల్లి అభిమానులు చేరడంతో ఇంకా తిరుగులేని శక్తిగా మారిందన్నారు. -
వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేదురుమల్లి రాంకూమార్‌రెడ్డి
-
జగన్ సీఎం కావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిన అవసరం, అవశ్యం ఉందని దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి జగన్ పాలనతోనే సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి పాతకాలం నుంచి మంచి స్నేహం ఉందని చెప్పారు. గురువారం నెల్లూరులోని స్వర్ణముఖి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. నేదురుమల్లి అనుచరులు, అభిమానులు అందరితో చర్చించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో కలిసి అన్ని అంశాలపై మాట్లాడానని వివరించారు. తాను గత మూడేళ్లుగా బీజేపీలో కొనసాగానని, ఇప్పుడు బీజేపీలోని పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల్లో పాదయాత్రలో జగన్‌ను కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించారని, ఆయన ఆశయసాధనే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తమకు మిత్రుడే అన్నారు. నిందలు వేయడానికే ప్రభుత్వమా? ప్రజలు పాలన చేయమని అధికారం కట్టబెడితే ఇతర పార్టీలపై నిందలు వేయడానికే తెలుగుదే శం పార్టీకి సరిపోతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధాని చాలెంజ్‌గా తీసుకోవాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అని విధాలా ముందుకు తీసుకుని పోవాలంటే జగన్ ఒక్కరే సమర్దుడని ఐదు కోట్ల మంది ప్రజ లు భావిస్తున్నారని తెలిపారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోవటం ఖాయమని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని వివరించారు. చైర్ పర్సన్‌ను అవమానించడం సిగ్గుచేటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల పోకడలు దా రుణంగా ఉన్నాయన్నారు. వెంకటగిరిలో బీసీ మహిళా చైర్‌పర్సన్‌ను అధికార పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ అవమానించడం సిగ్గు చేటన్నారు. రాపూరులో దళితులపై తప్పుడు కేసులు, గూడూరు చైర్ పర్సన్‌ను అవమానించడాలు, అక్రమ మైనింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా ఇలా చెప్పుకుంటే పోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత సామ్రాజ్యాలుగా చేసుకుంటూ ప్రజ లతో ఎన్నుకోబడిన వారిని అవమానించడం బాధాకరమన్నారు. వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు బాగా పనిచేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలపై తప్పుడు కేసులు పెట్టకుం డా, అధికార పార్టీ నేతల బెదిరింపులకు దిగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మూడేళ్లుగా బీజీపీలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తా అధిష్టానం ఏ పని అప్పగిస్తే అది చేస్తానని, ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతంగా ఉందన్నారు. మరింత తమవంతుగా బలో పేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. నేదురుమల్లి అభిమానులను అందరిని గ్రామ స్థాయిలో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. -
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నా..
-
త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నా..
సాక్షి, నెల్లూరు : దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరముందన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి రావాలని కోరారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైఎస్సార్ సీపీ చేరుతానని వెల్లడించారు. పార్టీ మారే అంశంపై చర్చించడానికి జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో రామ్‌కుమార్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న అభిమానులు వైఎస్సార్ సీపీలోకి చేరాలని ఒత్తిడి తెచ్చారు. -
వైఎస్సార్ సీపీలోకి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు నేదురుమల్లి ఆత్మీయ సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వారం క్రితం నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు వెళ్లి పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ పరిణమాల నేపథ్యంలో జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, ముఖ్య అనుచరులతో నేదురుమల్లి ఆత్మీయ సమావేశాన్ని నగరంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులు తమ అభిప్రాయాలను వివరించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పాల్గొన్న వారందరూ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయన అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని ఆయన తెలిపారు. గురవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలకు తెలిపారు. -
వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏ పార్టీలో చేరేది మరో రెండు నెలల్లో ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీ అనేది ఆగస్టులో చెబుతానని ఆయన తెలిపారు. అంతకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ రామ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు లేకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరేదీ తెలియాలంటే మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే. -
మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందునే రామ్‌కుమార్ రెడ్డిని సస్సెండ్ చేసినట్లు ఆదివారం హైదరాబాద్‌లో రఘువీరా మీడియాకు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓటమిపాలైన రామ్‌కుమార్.. బీజేపీలో చేరతారనే వార్తలు గత కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి కషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలిసింది.