
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు నేదురుమల్లి ఆత్మీయ సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వారం క్రితం నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు వెళ్లి పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
ఈ పరిణమాల నేపథ్యంలో జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, ముఖ్య అనుచరులతో నేదురుమల్లి ఆత్మీయ సమావేశాన్ని నగరంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులు తమ అభిప్రాయాలను వివరించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పాల్గొన్న వారందరూ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయన అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని ఆయన తెలిపారు. గురవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment