సాక్షి, కొండెపి : మెగా డీఎస్సీ కోసం జగనన్నను గెలిపించి రాజన్నరాజ్యం తెంచుకుంటామని నిరుద్యోగ యువత స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు బహిరంగ సభతో ప్రచారం మొదలుపెట్టునున్నారు. ఈ సభకు వచ్చిన యువతను సాక్షి పలకరించగా.. జాబు రావాలంటే బాబు పోవాలని, చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టపట్టించారని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది డీఎస్సీ వేస్తానని చంద్రబాబు దారుణంగా మోసం చేశారని, 23 వేల పోస్ట్‌లు వేస్తానని 7 వేల పోస్ట్‌లు మాత్రమే వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌లు పెంచమని పోరాడితే జైల్లో పెట్టారని, సీపీఎస్ పెన్షన్ రద్దు కోసం పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. సీపీఎస్ పెన్షన్ రద్దు చేయాలన్నా.. నిరుద్యోగుల సమస్యల పోవాలన్నా వైఎస్ జగన్ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల నిరుద్యోగుల ఉన్నామని, తమ కుటుంబాల్లోని మొత్తం 30 లక్షల ఓట్లు వైఎస్ జగన్‌కు వేసి రాజన్య రాజ్యం తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తీరాలన్నా.. ఉద్యోగుల విప్లవం రావాలన్నా జగనన్న సీఎం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment