ఏపీ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి(పాత చిత్రం)
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏ పార్టీలో చేరేది మరో రెండు నెలల్లో ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీ అనేది ఆగస్టులో చెబుతానని ఆయన తెలిపారు.
అంతకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ రామ్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు లేకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరేదీ తెలియాలంటే మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment