Rajamohan Reddy
-
బీజేపీ - టీడీపీ మళ్లీ కలుస్తాయి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ-టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అన్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం ఆంధ్రప్రదేశ్ అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటు భవన్ వద్ద విలేకరులతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్ రెడ్డి మాట్లాడారు. 'విభజన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ కుమ్మక్కయ్యాయంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు యూటర్న్ తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు కృష్టి చేయాలి. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి టీడీపీ చేసిందేమీ లేదు. కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తాం. అవిశ్వాసంపై సహకరించాలని పలు పార్టీలను కోరుతున్నాం. చంద్రబాబు తీరువల్లే విభజన హామీలు నెరవేరట్లేదు. ప్రజల ఒత్తిడి మేరకే చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. లాలుచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. విభజన హామీల కోసం నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాకు విలన్ చంద్రబాబే. వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానానికి క్రెడిట్ వస్తుందని చంద్రబాబు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ప్రతి రోజు పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ చర్చ జరిపించాల్సిందే' అని ఎంపీలు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటిసులు ఇస్తున్నా సభ సజావుగా లేదంటూ స్పీకర్ సభను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. -
రాజ్యసభలో జైట్లీ వ్యాఖ్యలు బాధాకరం
-
'ఫిరాయింపులపై ఉత్తరాఖండ్ తరహాలోనే చర్యలు'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ తరహాలోనే చర్యలుంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయనిక్కడ మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం ఖాయమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులు కోల్పోవడం తథ్యమని మేకపాటి స్పష్టం చేశారు. -
ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారు: మేకపాటి
ఢిల్లీ: నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో వేల ఎకరాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని పేరుతో భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. భూదందాపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మేకపాటి డిమాండ్ చేశారు. -
నేడు పాస్‌పోర్టు మేళా
నెల్లూరు (సెంట్రల్) : జిల్లా వాసులు పాస్‌పోర్టు సేవలు సులభంగా పొందేందుకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. పాస్‌పోర్టు సేవలను నెల్లూరులోనే పొందేందుకు వీలుగా మేళా నిర్వహించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్‌ను ఎంపీ మేకపాటి కోరారు. దీనికి స్పందించిన ఆమె నెల్లూరులో ఈ సదుపాయాన్ని కల్పించేందుకు అంగీకరించారు. శనివారం నగరంలోని జెడ్పీ హాలులో ఉదయం నుంచి ఈ పాస్‌పోర్టు మేళా జరగనుంది. ఆన్లైన్లో స్పాట్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ఈ అవకాశం ఉంటుంది. ఈ పాస్‌పోర్టు మేళాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. -
రేపు జిల్లాకు జగన్
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్ర, శనివారాల్లో జిల్లాలో సమైక్యశంఖారావం యాత్రలో జగన్ పాల్గొంటారు. ఈ విషయాన్ని పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఆత్మకూరు, కావలి, గూ డూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలతో కలిసి ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు నాయుడుపేట బహిరంగ సభలో జగన్ పాల్గొంటారన్నారు. సాయంత్రం 3 గంటలకు మనుబోలు సభలో, 6 గంటలకు గూడూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నా రు. రాత్రికి గూడూరులో బస చేస్తారని ఎంపీ చెప్పారు. ఫిబ్రవరి 1న ఉదయం 10కి వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం 6కు ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడుతారని ఎంపీ తెలిపారు. అనంతరం జగన్ పులివెందులకు వెళుతారన్నారు. సమైక్య శంఖారావం యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులుకు, సమైక్యవాదులకు ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో జగన్ యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. నెల్లూరులో అంతకు మించి విజయవతం చేయాలని కోరారు. జగన్ యాత్ర విజయవంతానికి నియోజక వర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని మేకపాటి కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. సమైక్యవాద పార్టీ అధినేతగా జిల్లాలో జరగనున్న జగన్ శంఖారావం యాత్రను పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు విజయవంతం చేయాలని మేరిగ మురళీధర్ కోరారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజక వర్గంలో గత సంవత్సరం డిసెంబర్ 22 నుంచి పాదయాత్ర ప్రారంభించి 514 కిలో మీటర్లు కొనసాగించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర నిర్వహించానన్నారు. యాత్ర వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నానన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో మరింత అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం జగన్‌తో చర్చిస్తానన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలతో పాటు పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రజలు ఫ్లోరైడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆనం అవినీతికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మహిళా కన్వీనర్ బండ్లమూడి అనిత, స్పందన ప్రసాద్, పాండురంగారెడ్డి, వహీద్ బాషా, సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువ నాయకుడిని ఆదరించండి
చేజర్ల, న్యూస్‌లైన్: ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయనున్న యువ నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆదరించాలని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విన్నవించారు. మండలంలోని కాకివాయి, కండాపురం, నాగలవెలటూరు, యర్రబల్లి గ్రామాల్లో ఆదివారం గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశానుసారం గౌతమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. పట్టుదల, దృఢసంకల్పం ఉన్న యువనేత గౌతమ్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. చేజర్ల మండలంలో ఇంత ప్రజాస్పందన వస్తుందని ఊహించలేదన్నారు. ఏ మారుమూల గ్రామానికి గౌతమ్ వెళ్లినా హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారన్నారు. నాలుగు నెలల్లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి పేదలను నిరాశ్రయులను చేసిందని విమర్శించారు. జగన్ పాలనలో వైఎస్సార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్న జగన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఏర్పడే సమస్యలు కేంద్రానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, నాయకులు ఎస్డీ నా యబ్, ఎస్కే వహీద్‌బాషా, సానా వేణుగోపాల్‌రెడ్డి, బూదళ్ల వీరరాఘవరెడ్డి, బాలిరెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాబోయే సీఎం జగనే
సోమశిల, న్యూస్‌లైన్: మరికొద్దిరోజుల్లో యువనేత జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆత్మకూరు నియోజకవర్గ సమన్వకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అనంతసాగరం మండలంలో గౌరవరం, సంజీవనగరం, అనంతసాగరం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ మేకపాటి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డారన్నారు. ఆయన హయాంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్‌తో పాటు ఉచిత విద్య, పక్కా ఇళ్లు ఉచిత విద్యుత్‌తో పాటు ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి సజావుగా సాగించారన్నారు. నేటి ప్రభుత్వంలో ఏ పథకం సక్రమంగా సాగటంలేదన్నారు. సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు సక్రమంగా అందడం లేదన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని సజావుగా సాగుతాయని, వాటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారన్నారు. నియోజకవర్గంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రత్యేకంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, బట్రెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గౌరవరం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గౌరవరంలో సర్పంచ్ గంగవరపు భుజంగరావు కుటుంబాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డిలు గురువారం పరామర్శించారు. సర్పంచ్ భుజంగరావు అనారోగ్య కారణాలు వల్ల గత కొంతకాలంగా చికిత్సపొందుతూ ఉదయం ఆసుపత్రిలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న నాయకులు వారి ఇంటికి వెళ్లి భుజంగరావు కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి వెంట సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ బండ్లమూడి అనిత, అక్కలరెడ్డి అంకిరెడ్డి, చిలకా సుబ్బరామిరెడ్డి, బుట్టి వెంకట సుబ్బారెడ్డి ఉన్నారు. -
సీమాంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితం
సోమశిల, న్యూస్‌లైన్: విభజన పేరుతో తెలుగు ప్రజలను వేరుచేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో భూస్థాపితం అయిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో సోమవారం పాల్గొన్న ఆయన బొమ్మవరం అగ్రహారంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూపీఏ సర్కారు కూడా సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఉత్తుత్తి వాగ్ధానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తన తొమ్మిదేళ్ల సుదీర్ఘ పాలనలో ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. పాలకులు ఎప్పుడూ మోసగాళ్లు కాకూడదన్నారు. అందరికీ ఇళ్లు.. పింఛన్ పెంపు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్‌ను రూ.200 నుంచి రూ.500కి పెంచుతామన్నారు. ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తామన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 47 లక్షల పక్కాఇళ్ల నిర్మాణం జరిగితే, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 47 లక్షలు నిర్మించారన్నారు. వైఎస్సార్ బతికుంటే ఫ్లోరైడ్ బాధితులకు రక్షిత మంచినీటి సరఫరాతో పాటు అన్ని హామీలను నెరవేర్చే వారన్నారు. ఆయన లేకపోవడంతో రాష్ట్రం కష్టాల్లో పడిందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే అన్నీ సజావుగా సాగుతాయన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా తనను దీవించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, నాగలపాటి ప్రతాప్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, ఇందూరు శేషారెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, చిలకా సుబ్బరామిరెడ్డి, బుట్టి వెంకటసుబ్బారెడ్డి, పాలపాటి నాగిరెడ్డి, కేతా రామకృష్ణారెడ్డి, పాలపాటి నాగార్జునరెడ్డి, రాపూరు సుబ్బారెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, బట్రెడ్డి సోమశేఖరరెడ్డి, బిజివేముల ఓబులురెడ్డి, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, యర్రమళ్ల శంకర్‌రెడ్డి, మందా రామచంద్రారెడ్డి, హజరత్‌బాబు ఉన్నారు. -
రక్షిత మంచినీటి సరఫరానే లక్ష్యం
ఇస్కపల్లి(మర్రిపాడు), న్యూస్‌లైన్: ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్కపల్లిలో లభించే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నందున ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వీరికి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వమే ప్లాంట్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. ఆయన మరణానంతరం ఆ పథకాలు మూలనపడ్డాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాన్ని విభజించడం సమంజసంకాదన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితే కష్టాలు దూరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల కష్టాలు దూరమైపోతాయని రాజమోహన్‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 500, వికలాంగులకు వెయ్యి రూపాయలకు పెంచుతారన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రకటన రానుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారని, రానున్న రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తానన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను తొలగించేందుకు సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించిన ఘనత మేకపాటి రాజమోహన్రెడ్డిదేనన్నారు. ఆయన మంచి మనసున్న నేతని పేర్కొన్నారు. ప్రజలు అడిగిందే తడువుగా సొంత నిధులు వెచ్చించి వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్‌లు పెంచలయ్య, బొర్రా వెంకటేశ్వర్లురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శంకర్‌రెడ్డి, సోమల మాధవరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు
కావలి, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలిలోని 31వ వార్డులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంగళవారం జనదీవెన పేరుతో నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, మే 24వ తేదీ లోపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వారికే కేంద్రంలో తాము మద్దతు ఇస్తామన్నారు. 25 నుంచి 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే గతంలో ఎన్నో సార్లు తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చిందన్నారు. ఎప్పుడూ పదవులు రాని వారే ఉద్యమం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చి తెలుగుజాతికి చేసిన అన్యాయాన్ని ఎవరూ మరువరన్నారు. ఉప ఎన్నికల తరహాలోనే భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీపెద్దలకు దిమ్మ తిరిగేలా చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలపై వినతులు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు రాజమోహన్‌రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. పెద్దపవని రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ అవసరం లేదని, అండర్ బైపాస్ నిర్మించాలని వైకుంఠపురానికి చెందిన రైతులు కోరారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. జనతాపేట వరవ కాలువను కావలి పెద్దచెరువుకు కలపాలని రైతులు ఎంపీ దృష్టికి తేగా జగన్ సీఎం అయిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల దృష్టికి సాగునీటి సమస్య సాగునీటి కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌తో పాటు సోమశిల ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన కావలి చెరువును పరిశీలించారు. కావలి చెరువుకు నీరు ఇవ్వకుంటే పొలాలు ఎండిపోతాయని ఆయకట్టు రైతు లు ఎంపీ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై అధికారులతో మాట్లాడామని, పొలాలు ఎండకుండా నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 20 ఏళ్లుగా తాము విద్యుత్ సౌకర్యానికి నోచుకోవడం లేదని చెరువుకట్ట గిరిజన కాలనీ వాసులు ఎంపీకి తెలిపారు. వెంటనే ఎంపీ విద్యుత్ శాఖ ఎస్ఈ నాగశయనరావుతో ఫోన్లో మాట్లాడారు. -
ఏకకాలంలో 175 నియోజకవర్గాల్లో నిరాహార దీక్ష
నెల్లూరు: సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త పంథాలో ముందుకెళుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఉద్యమించటానికి వైఎస్సార్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఏకకాలంలో 175 నియోజక వర్గాల్లో నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి వైఎస్సార్ సీపీ యత్నిస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం బాపు బాటలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ సీపీ తెలిపింది. అక్టోబర్ 19వ తేదీన హైదరాబాద్ నగరంలో సమైక్య శంఖారావానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి. .సమైక్య శంఖారావం సభను అడ్డుకోవడానికి యత్నాలు జరుగుతున్నాయని, ఆ సభను ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు. సభకు అనూహ్య స్పందన లభిస్తుందనే అడ్డుకోవడానికి చూస్తున్నారన్నారు. సభకు తరలివచ్చేందుకు లక్షలమంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
విభజన లేఖను బాబు ఉపసంహరించుకోవాలి
సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను అంగీకరిస్తూ ఇచ్చిన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెంటనే వెనక్కు తీసుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండు చేశారు. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 560 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మేకపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా చంద్రబాబు బస్సుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక పక్క విభజనకు అనుకూలమంటూనే పార్లమెంటులో పార్టీ ఎంపీలతో ధర్నాలు చేయిస్తున్నారని విమర్శిం చారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెబుతూనే దానిని పోగొట్టుకోవడానికి బాబు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్సీపీ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, చంద్రబాబు కూడా స్పష్టత ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు. షర్మిల సమైక్య శంఖారావానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెసు, టీడీపీ అనే రెండు విఘ్నాలున్నాయని, ఇవి 2014తో తొలగిపోతాయని.. సమైక్య రాష్ట్రానికి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శాసనం కాదు నెల్లూరు: రాష్ట్ర విభజన విషయంలో సీడ బ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం శాసనం కాదని మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో రిలేదీక్షలు చేస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ అధ్యాపకులకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రుల్లో పెల్లుబుకుతున్న ఉద్యమం, ఆందోళనల వివరాలను నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని చెప్పారు. ఈ సమయంలోనే సీమాంధ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
సమైక్య త్యాగం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా
నమ్మిన సిద్ధాంతానికి, నైతిక విలువలకు కట్టుబడి పదవిని తృణప్రాయంగా త్యజించడంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు సోమవారం స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు ఫాక్స్‌ద్వారా పంపారు. జిల్లా ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా పదవిని త్యజించేందుకు సిద్ధపడ్డారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరంచోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సీబీఐ రూపొందించిన ఎఫ్ఐఆర్లో మహానేత పేరును చేర్చడాన్ని నిరసిస్తూ 2011 ఆగస్టు 24వ తేదీన తన పదవికి రాజీనామా సమర్పించారు. అప్పట్లో రాజీనామాను ఆమోదించడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ వ్యవధిలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టేనా అని ఎంపీకి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ విషయంలో తనకు మరో అభిప్రాయం లేదని ఆయన కచ్చితమైన నిర్ణయం వెల్లడించారు. చివరిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 28న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేరుగా రాజమోహన్‌రెడ్డితో రాజీనామాపై తుది నిర్ణయం కోరారు. అప్పుడు కూడా తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడంతో అదే రోజు ఆమోదించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అదే ఏడాది జూలై 12న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా సంచలన విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనలో అనుసరించిన వైఖరికి నిరసనగా రాజీనామా ప్రకటించారు. ఆయన రెండు సార్లు రాజీనామా చేయాల్సి వచ్చిన సందర్భం ఆగస్టు మాసం కావడం యాదృశ్చికం.