
'ఫిరాయింపులపై ఉత్తరాఖండ్ తరహాలోనే చర్యలు'
ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ తరహాలోనే చర్యలుంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ తరహాలోనే చర్యలుంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయనిక్కడ మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం ఖాయమన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవులు కోల్పోవడం తథ్యమని మేకపాటి స్పష్టం చేశారు.