నెల్లూరు: సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త పంథాలో ముందుకెళుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఉద్యమించటానికి వైఎస్సార్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఏకకాలంలో 175 నియోజక వర్గాల్లో నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి వైఎస్సార్ సీపీ యత్నిస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం బాపు బాటలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ సీపీ తెలిపింది. అక్టోబర్ 19వ తేదీన హైదరాబాద్ నగరంలో సమైక్య శంఖారావానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి. .సమైక్య శంఖారావం సభను అడ్డుకోవడానికి యత్నాలు జరుగుతున్నాయని, ఆ సభను ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు. సభకు అనూహ్య స్పందన లభిస్తుందనే అడ్డుకోవడానికి చూస్తున్నారన్నారు. సభకు తరలివచ్చేందుకు లక్షలమంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.