సోమశిల, న్యూస్‌లైన్: మరికొద్దిరోజుల్లో యువనేత జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆత్మకూరు నియోజకవర్గ సమన్వకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అనంతసాగరం మండలంలో గౌరవరం, సంజీవనగరం, అనంతసాగరం గ్రామాల్లో పాదయాత్ర
నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ మేకపాటి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డారన్నారు. ఆయన హయాంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్‌తో పాటు ఉచిత విద్య, పక్కా ఇళ్లు ఉచిత విద్యుత్‌తో పాటు ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి సజావుగా సాగించారన్నారు.
నేటి ప్రభుత్వంలో ఏ పథకం సక్రమంగా సాగటంలేదన్నారు. సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు సక్రమంగా అందడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని సజావుగా సాగుతాయని, వాటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారన్నారు. నియోజకవర్గంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రత్యేకంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, బట్రెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
గౌరవరం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
గౌరవరంలో సర్పంచ్ గంగవరపు భుజంగరావు కుటుంబాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డిలు గురువారం పరామర్శించారు. సర్పంచ్ భుజంగరావు అనారోగ్య కారణాలు వల్ల గత కొంతకాలంగా చికిత్సపొందుతూ ఉదయం ఆసుపత్రిలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న నాయకులు వారి ఇంటికి వెళ్లి భుజంగరావు కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి వెంట సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ బండ్లమూడి అనిత, అక్కలరెడ్డి అంకిరెడ్డి, చిలకా సుబ్బరామిరెడ్డి, బుట్టి వెంకట సుబ్బారెడ్డి ఉన్నారు.
కాబోయే సీఎం జగనే
Published Fri, Jan 17 2014 3:35 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement