ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఇస్కపల్లి(మర్రిపాడు), న్యూస్‌లైన్: ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్కపల్లిలో లభించే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నందున ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వీరికి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వమే ప్లాంట్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. ఆయన మరణానంతరం ఆ పథకాలు మూలనపడ్డాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాన్ని విభజించడం సమంజసంకాదన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ సీఎం అయితే కష్టాలు దూరం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల కష్టాలు దూరమైపోతాయని రాజమోహన్‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 500, వికలాంగులకు వెయ్యి రూపాయలకు పెంచుతారన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రకటన రానుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారని, రానున్న రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తానన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను తొలగించేందుకు సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించిన ఘనత మేకపాటి రాజమోహన్‌రెడ్డిదేనన్నారు. ఆయన మంచి మనసున్న నేతని పేర్కొన్నారు. ప్రజలు అడిగిందే తడువుగా సొంత నిధులు వెచ్చించి వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్‌లు పెంచలయ్య, బొర్రా వెంకటేశ్వర్లురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శంకర్‌రెడ్డి, సోమల మాధవరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు.