లక్సెట్టిపేట్: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్, ఎన్ఆర్‌ఐ గుండ అమర్‌నాథ్, 'నాటా' అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి దాతృత్వంతో కొత్తూర్ గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి సహకారం అందించారు. ఆర్వో ప్లాంట్‌ను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు.
డా.వైఎస్సార్ ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా వాటర్ ప్లాంట్స్ నిర్మించి లక్షలాది మందికి ప్రతి రోజూ మంచి నీరు అందిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో హెల్త్ క్యాంప్‌లు, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలకు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో మందికి చేయూత అందిస్తోంది. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ గోసల రాఘవరెడ్డి, దాత గుండ అమర్‌నాథ్, డాక్టర్ ప్రేమ్ సాగర్‌రెడ్డికి ఆళ్ల రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
చదవండి: హైదరాబాద్ రేసర్.. రికార్డులు తిరగరాశాడు!
చదవండి: ఉద్యోగ సామర్థ్యాలున్న పట్టణాల్లో హైదరాబాద్ టాప్
Comments
Please login to add a commentAdd a comment