
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ 72వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ వెస్ట్ వైఎస్‌ఆర్‌సీపీ సీటెల్ (వాషింగ్టన్) - పోర్ట్ ల్యాండ్ విభాగం, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) అధ్వర్యంలో సీటెల్ హిల్లైర్ పార్క్ లో ఘనంగా నిర్వాహించారు.
ఈ వేడుకల్లో సీటెల్ లో ఉన్న వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వైఎస‍్సార్ కు నివాళులర్పించారు. అనంతరం అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల జ్యోతి ప్రజల్వన అందర్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్టీ రీజినల్ కో ఆర్డినేట్ దుశ్యంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తన హయాంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన ఆరోగ్యశ్రీ,108,104, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో చరిత్రలో చిరస్మరనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ " తండ్రి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగు వేస్తా అని" వైఎస్సార్ ఆదర్శాలను పునికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment