దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం మిన్నియాపాలిస్ నగరంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు వైఎస్సార్ తెలుగు ప్రజలకు చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేలా కృషి చేసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్లా రామి రెడ్డి, బేలీఫ్ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ రెడ్డికి ప్రవాస భారతీయులు కృజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకట రామిరెడ్డి చింతం, శంకర్ బండి, సాయినాథ్ రెడ్డి ఎర్రి, నారాయణ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి వాకా, మైసూరా రెడ్డి, ఎం రామాంజి , గంగి రెడ్డి, మోహన్ మార్చేట్టి, శ్రీనివాస రెడ్డి (రోబో), వీర కిశోర్ రెడ్డి, రామాంజన రెడ్డి మోటాటి, తానేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment