సోమశిల, న్యూస్‌లైన్: విభజన పేరుతో తెలుగు ప్రజలను వేరుచేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో భూస్థాపితం అయిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో సోమవారం పాల్గొన్న ఆయన బొమ్మవరం అగ్రహారంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూపీఏ సర్కారు కూడా సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఉత్తుత్తి వాగ్ధానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తన తొమ్మిదేళ్ల సుదీర్ఘ పాలనలో ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. పాలకులు ఎప్పుడూ మోసగాళ్లు కాకూడదన్నారు.
అందరికీ ఇళ్లు.. పింఛన్ పెంపు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్‌ను రూ.200 నుంచి రూ.500కి పెంచుతామన్నారు. ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తామన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 47 లక్షల పక్కాఇళ్ల నిర్మాణం జరిగితే, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 47 లక్షలు నిర్మించారన్నారు.
వైఎస్సార్ బతికుంటే ఫ్లోరైడ్ బాధితులకు రక్షిత మంచినీటి సరఫరాతో పాటు అన్ని హామీలను నెరవేర్చే వారన్నారు. ఆయన లేకపోవడంతో రాష్ట్రం కష్టాల్లో పడిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే అన్నీ సజావుగా సాగుతాయన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా తనను దీవించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, నాగలపాటి ప్రతాప్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, ఇందూరు శేషారెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, చిలకా సుబ్బరామిరెడ్డి, బుట్టి వెంకటసుబ్బారెడ్డి, పాలపాటి నాగిరెడ్డి, కేతా రామకృష్ణారెడ్డి, పాలపాటి నాగార్జునరెడ్డి, రాపూరు సుబ్బారెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, బట్రెడ్డి సోమశేఖరరెడ్డి, బిజివేముల ఓబులురెడ్డి, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, యర్రమళ్ల శంకర్‌రెడ్డి, మందా రామచంద్రారెడ్డి, హజరత్‌బాబు ఉన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ భూస్థాపితం
Published Tue, Jan 14 2014 3:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement