ఆమ్‌స్టర్‌డామ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న కశ్యప్.. తన పాస్‌పోర్ట్ పోయిన విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని విన్నవించాడు.
‘నా పాస్ట్‌పోర్ట్ పోయింది. గత రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగుట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్‌లో పాల్గొనడానికి పయనం కావాల్సి ఉంది. డెన్మార్క్‌కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్‌పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరతగతిన సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని కశ్యప్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన ట్వీట్‌ను క్రీడాశాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీలకు సైతం ట్యాగ్ చేశాడు.
Good Morning Ma’am, I’ve lost my passport at Amsterdam last night . I have to travel to Denmark Open, French Open and Saarloux Open,Germany . My ticket for Denmark is on Sunday, 14th October .I request help in this matter . @SushmaSwaraj @Ra_THORe @himantabiswa @narendramodi
— Parupalli Kashyap (@parupallik) 13 October 2018
Comments
Please login to add a commentAdd a comment