
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ ప్రత్యేక పాస్‌పోర్టును ఇచ్చింది. ఇప్పటివరకు సాధారణ పాస్‌పోర్టు కలిగిన ఆయనకు తదుపరి విదేశీ పర్యటనల్లో ప్రొటోకాల్‌ను వర్తింప చేసేందుకు డిప్లమాటిక్ పాస్‌పోర్టు ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి శనివారం వెళ్లారు. పాస్‌పోర్టు జారీకి అవసరమైన వేలిముద్రలు, ఇతర వివరాలను అక్కడి అధికారులకు ఇచ్చారు.