సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్‌పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం.
‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు.
లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్‌గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment