inter religion marriage
-
ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని
నార్నూర్: పరువు కత్తికి మరో ప్రాణం బలైంది. కనిపెంచిన తల్లిదండ్రులే.. కన్నప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించారు. కూతురు వేరే మతం యువకుడిని ప్రేమించిందని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్‌కొండకి చెందిన పవార్ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. తల్లిదండ్రులు లేని సమయంలో రాజేశ్వరి తరచూ పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసేది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని మందలించారు. తమను పెద్దలు కలవనీయరని భావించిన వారు మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువతి తండ్రి పవార్ దేవీదాస్.. సలీంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజులుగా అతడు ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు. ఆత్మహత్యగా నమ్మించే యత్నం... శుక్రవారం ఉదయం దేవీదాస్ సర్పంచ్ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. చదవండి: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి.. -
సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్‌లో పరువు హత్య చేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సరూర్ నగర్లో బుధవారం రాత్రి పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు, అశ్రీన్ దంపతులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది. ‘నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముందు వాపోయింది. ఇద్దరే నిందితులు: ఏసీపీ నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు. నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు: డీసీపీ ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని ట్రెస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామన్నారు. వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లు నాగరాజు పై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు. నిన్న నాగరాజు పనిచేస్తున్న మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడు. జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని చెప్పారు. బంధువు మసూద్ తో కలిసి మోబిన్ సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
గొప్ప ప్రేమికుడిగా ఉండు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన వివాదాస్పద మతాంతర వివాహ కేసు బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెంచ్ సదరు వ్యక్తిని గొప్ప ప్రేమికుడిగా.. నమ్మకమైన భర్తగా ఉండాలని అభిప్రాయ పడింది. ఆ వివరాలు.. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ హిందు యువతి, అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. అబ్బాయి వేరే మతస్తుడు కావడంతో యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించలేదు. అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ వ్యక్తి వారి నమ్మకాన్ని గెల్చుకోవడం కోసం మతం మార్చుకుని హిందువుగా మారాడు. అనంతరం యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు అతడి చర్యలను అవమానకరమైనవిగా వర్ణిస్తూ.. వివాదాస్పదం చేశారు. అంతేకాక అతడి మీద చత్తీస్‌గఢ్ కోర్టులో కేసు కూడా నమోదు చేశారు. సుప్రీం కోర్టులోని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు సదరు వ్యక్తిని మతం, పేరు మార్చుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించింది. అంతేకాక మేజర్లైన ఇరువురి యువతి యువకుల ఆమోదంతో జరిగిన కులాంతర, మతాంతర వివాహాలను కోర్టు వ్యతిరేకించదని స్పష్టం చేసింది. కేవలం అమ్మాయి భవిష్యత్తు గురించి మాత్రమే కోర్టు ఆలోచిస్తుందని తెలిపింది. అంతేకాక ప్రేమించిన యువతి కోసం మతం మార్చుకోవడానికి సిద్ధపడ్డావ్. జీవితాంతం గొప్ప ప్రేమికుడిగా, నమ్మకమైన భర్తగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. -
నా తండ్రి చితికి ఆమే నిప్పంటించారు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్‌పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం. ఆ జంట తప్పు చేసిందా? ‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్‌గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా -
మరో విషాదాంతం..
ముంబై: ‘ఏం పెట్టి పోషిస్తావురా?’ అని ప్రశ్నించడానికి అతనేమీ ఆవారా కాదు. బిజినెస్ బాగా నడిచే ఓ గార్మెట్ షాప్ ఓనర్. ఎగువ మధ్యతరగతి కుటుంబం, కారు, మంచి ఇల్లు!! ‘ఏం చూసి ప్రేమించావు?’ అని వెలెత్తిచూపడానికి కూడా అవకాశంలేని వ్యక్తిత్వం ఆమెది. ఉద్యోగం చేస్తూ ఇంటికి ఆసరగా నిలబడింది. స్వతంత్రభావనలు మెండుగా నింపుకొన్న నేటి యువతరానికి ప్రతీకలైన ఈ ఇద్దరూ ‘మతం’ అనే జాఢ్యానికి బలైపోయారు. మతాంతర వివాహం చేసుకుకోవాలనుకున్న ఈ జంట.. ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విషంతాగి ప్రాణాలు విడిచారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలివి.. నాలుగేళ్ల ప్రేమ..: నవీ ముంబైలోని దిఘా ప్రాంతానికి చెందిన మనీషా నారాయణ్ నెగి(21) డిగ్రీ పూర్తిచేసి, ఓ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేసేది. ములుంద్‌లోని ఇస్లామ్‌పూరకు చెందిన సల్మాన్ అఫ్రోజ్ ఖాన్(26) స్థానికంగా ఓ గార్మెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట ఏర్పడిన వీరి పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మతాలు వేరువేరన్న కారణంగా ఇంట్లోవాళ్లు వ్యతిరేకించారు. నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మనీషా-సల్మాన్‌ను ఒక నిర్ణయానికి వచ్చారు. కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి..: ములుంద్‌లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో అనుమానిత కారు గురించి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఇంజిన్ ఆన్‌లోనే ఉన్నా, లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి డోర్ తీశారు. డ్రైవింగ్ సీట్లో సల్మాన్, అతని పక్కనే మనీషా సృహతప్పి పడిఉన్నారు..ఇద్దరి నోటి వెంటా తెల్లటి నేరగ! వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సల్మాన్‌దిగా భావిస్తోన్న నీలిరంగు లాన్సర్ కారు నుంచి ఒక షోడా బాటిల్‌ను, విషం డబ్బాను, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా కారులోనే: మతాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నాలుగు రోజుల కిందట ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ.. తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు చెప్పారు. ఈ నాలుగు రోజులూ మనీషా-సల్మాన్‌లు కారులోనే గడిపినా.. ఉద్యోగాలకు క్రమం తప్పకుండా వెళ్లేవారని, రంజాన్ ఉపవాసాలుంటున్న సల్మాన్ ఇఫ్తార్ కోసం మాత్రమే అరగంట ఇంటికి వెళ్లొచ్చేవాడని పోలీసులు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపామని ములుంద్ స్టేషన్ అధికారులు తెలిపారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సల్మాన్ తండ్రి అంగీకరించగా, మనీషా కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
సంతోష్‌నగర్(హైదరాబాద్ సిటీ): భర్తతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... రక్షాపురం కాలనీ శివాలయం ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్రం, సకీనా ఆలియాస్ శ్వేత (35)లు దంపతులు. వీరికి రెహాన్(7), ఆసద్(11 నెలలు) సంతానం. కాగా సకీనా గత తొమ్మిదేళ్ల కిందట అక్రంను మతాంతర వివాహం చేసుకుంది. శ్వేత వివాహం అనంతరం తన పేరును సకీనాగా మార్చుకుంది. మహ్మద్ అక్రం ప్రైవేటు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంట్లో భార్యభర్తల మధ్య ఆర్థిక, ఇతర సమస్యలపై గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి భార్యభర్తల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. భర్త ఇంట్లో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సకీనా రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కుమారుడు రెహాన్ విషయాన్ని ఫోన్లో మామయ్య గోవింద్‌కు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న గోవింద్ స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.