ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం  | Direct tax collection growth rate is 14 percent | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం 

Published Tue, Jan 8 2019 1:36 AM | Last Updated on Tue, Jan 8 2019 1:36 AM

Direct tax collection growth rate is 14 percent - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2018 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య (2017 ఇదే కాలంతో పోల్చి) స్థూలంగా 14.1 శాతం పెరిగాయి. విలువలో ఇది రూ.8.74 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.    ముఖ్యాంశాలు చూస్తే... 

∙2018 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య రిఫండ్స్‌ విలువ రూ.1.30 లక్షల కోట్లు. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఇది 17 శాతం అధికం. రిఫండ్స్‌ తరువాత, నికర వసూళ్లు 13.6 శాతం వృద్ధితో రూ.7.43 లక్షల కోట్లుగా ఉన్నాయి.  

∙ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.11.50 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఇప్పటికి జరిగిన వసూళ్లు ఇందులో 64.7 శాతానికి సమానం.  

∙ముందస్తు వసూళ్లు 14.5 శాతం వృద్ధితో రూ.3.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  

∙కార్పొరేట్‌ పన్ను వసూళ్లు స్థూలంగా 14.8 శాతం పెరిగాయి. వ్యక్తిగత ఆదాయ వసూళ్లలో 17.2 శాతం వృద్ధి నమోదయ్యింది. రిఫండ్స్‌ తరువాత ఈ వృద్ధి రేట్లు వరుసగా 16 శాతం, 14.8 శాతంగా ఉన్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement