పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్యాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ముందుకొస్తున్నారు. 2017-18లో దాదాపు కోటి మంది కొత్తగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేశారు. ఫలితంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో మెరుగైన వృద్ధి నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది 5.4 కోట్ల రిటన్స దాఖలవగా, 2017-18లో 6.8 కోట్ల ఆదాయ పన్ను రిటన్స్ దాఖలయ్యాయని పన్ను విభాగం అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా పన్ను పరిధిని విస్తరించేందుకు, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల ఫలితంగా ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు నూతనంగా అమలు చేస్తున్న జీఎస్‌టీతో పరోక్ష పన్ను వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడంతో 2017-18 కేంద్ర బడ్జెట్ అంచనాలను రెవెన్యూ శాఖ అధిగమించింది. 2016-17లో వసూళ్ల కంటే 17.1 శాతం అధికంగా ప్రత్యక్ష పన్నులు రూ 9.9 కోట్ల మేర వసూలయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ 10 లక్షల కోట్ల మైలురాయిని దాటతాయని భావిస్తున్నామని ఫైనాన్స్ సెక్రటరీ హస్ముక్ అథియా ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment