న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–22 మార్చి) జూన్ 15 వరకూ భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 100.4 శాతం ఎగసి రూ.92,762 కోట్ల నుంచి రూ.1,85,871 కోట్లకు చేరాయి. సెకండ్ వేవ్ వల్ల ఎకానమీ తీవ్రంగా నష్టపోదన్న అంచనాలకు తాజా గణాంకాలు బలాన్నిస్తున్నాయి.ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.
రిఫండ్స్ రూ.30,731 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.16 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే రూ.1.37 లక్షల కోట్ల నుంచి 57 శాతం పెరిగాయి. వీటిలో కార్పొరేట్ పన్నులు (సీఐటీ) రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్ అనంతరం నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు. రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్స్ విలువ దాదాపు రూ.30,731 కోట్లు. కరోనా మొదటి వేవ్‌తో అతలాకుతలమైన 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment