ఆగస్టు 11 వరకూ రూ.6.93 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఆగస్టు 11వ తేదీ వరకూ 22.48 శాతం పెరిగి (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం వరకూ పోల్చి) 6.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.4.47 లక్షల కోట్లు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.22 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూళ్లు రూ.21,599 కోట్లు. ఇతర పన్నులు (లెవీ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ రూ.1,617 కోట్లు.
స్థూలంగా చూస్తే..
ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య రిఫండ్స్ రూ.1.20 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే రిఫండ్స్ 33.49 శాతం పెరిగాయి. వీటిని కూడా కలుపుకుంటే స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4.82 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను రూ.3.08 లక్షల కోట్లు ఉన్నాయి.
కొన్ని ముఖ్యాంశాలు...
→ ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 –24కన్నా ఈ మొత్తాలు 13 శాతం అధికం.
→ 2023–24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల పెరుగుదల నేపథ్యంలో అధిక పన్ను వసూళ్లు జరిగాయి. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment