transaction tax
-
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఆగస్టు 11వ తేదీ వరకూ 22.48 శాతం పెరిగి (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం వరకూ పోల్చి) 6.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.4.47 లక్షల కోట్లు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.22 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.21,599 కోట్లు. ఇతర పన్నులు (లెవీ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ రూ.1,617 కోట్లు. స్థూలంగా చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య రిఫండ్స్ రూ.1.20 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే రిఫండ్స్ 33.49 శాతం పెరిగాయి. వీటిని కూడా కలుపుకుంటే స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4.82 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను రూ.3.08 లక్షల కోట్లు ఉన్నాయి. కొన్ని ముఖ్యాంశాలు... → ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 –24కన్నా ఈ మొత్తాలు 13 శాతం అధికం. → 2023–24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల పెరుగుదల నేపథ్యంలో అధిక పన్ను వసూళ్లు జరిగాయి. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. -
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
ఒకవైపు పన్నులు.. మరోవైపు రాయితీలు
కేంద్ర బడ్జెట్‌పై భిన్న అంచనాలు • సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం • క్యాపిటల్ గెయిన్స్లోనూ మార్పులు! • కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు • లేదంటే పలు రంగాలకు ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: కొంత బాదుడు... కొంత ప్రోత్సాహకం... ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తీసుకురానున్న బడ్జెట్ రూపం ఇలా ఉండనుంది. కానీ, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే మోదీ సర్కారు నగదు కొరతతో ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆకస్మిక చర్యలకు దిగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపులను సవరించొచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్ పార్టిసిపెంట్లు తగినంత మొత్తాన్ని జాతి నిర్మాణం కోసం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్లో చేసిన ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏడాది లోపు షేర్లను కొని విక్రయిస్తే స్వల్ప కాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాలనే నిబంధన ఉంది. ఏడాదికి మించి అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేదు. అయితే, ప్రధాని ప్రకటన తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపునకు బదులు ప్రస్తుతమున్న ఏడాది కాలాన్ని మూడేళ్లకు మార్చే అవకావం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి చర్యలకు సంబంధించి ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైనా... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు లేదా నోట్ల రద్దు వల్ల నష్టపోయిన రంగాలకు ఇచ్చే ప్రోత్సాహక చర్యలతో దాన్ని ప్రభుత్వం అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రభుత్వం వ్యాపార నిర్వహణ వ్యయం, సంక్లిష్టతలను తగ్గించాలనుకుంటోంది. భారత్ పోటీతత్వాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని భావిస్తోంది. కానీ, అదే సమయంలో ద్రవ్య పరమైన లక్ష్యాలను చేరుకునేందుకు ఆదాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటోంది’’ అని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ట్యాక్స్ పార్ట్నర్ రాజేష్ హెచ్గాంధీ పేర్కొన్నారు. మరోవైపు పరోక్ష నిధుల బదిలీ పన్ను విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియే ఇన్వెస్టర్లు మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. విదేశీ కంపెనీలు తమ ఆస్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మొత్తం భారత్‌లో కలిగి ఉంటే, తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో పరోక్ష బదిలీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ గత డిసెంబర్లో ప్రకటన చేసింది. తమ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని భారత్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఫండ్స్‌కు ఈ ప్రకటన శరాఘాతమే. ఈ విషయంలో అవి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.