సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో డైరెక్ట్ టాక్స్ వసూళ్లు 15శాతంపెరిగాయని కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 4.39 లక్షల కోట్లు సేకరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.2 శాతం పెరిగింది. వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను లుకూడా ఇందులో భాగం. 2017-18 ఆర్థిక సంవత్సారికి గాను రూ. 9.8 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలలో ఇది 44.8 శాతంగా నిలిచిందని ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్, 2017 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లను తాత్కాలికంగా చూస్తే రూ .4.39 లక్షల కోట్లు వసూలు చేశాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో నికర వసూళ్లు కంటే 15.2 శాతం ఎక్కువ. 2017 ఏప్రిల్-అక్టోబర్లో స్థూల వసూళ్లు ( రిఫండ్స్ సర్దుబాటుకు ముందు) 10.7 శాతం పెరిగి 5.28 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఏడు నెలలో రిఫండ్స్ చేసిన మొత్తం రూ. 89,507 కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment