న్యూఢిల్లీ: ఆర్థిక రికవరీకి సంకేతంగా మూడేళ్ల (2017–18) తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను) మొట్టమొదటిసారి బడ్జెట్ (2021–22) లక్ష్యాలను అధిగమించనున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. 2021–22 తొలి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లయితే, దీనిని తాజాగా రూ.12.50 లక్షల కోట్లకు సవరించడం జరిగింది.ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లుగా నమోదవుతాయని (రూ.7.20 లక్షల కోట్లు కార్పొరేట్ల నుంచి రూ.7 లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను) తాజా బడ్జెట్ అంచనావేసింది
Comments
Please login to add a commentAdd a comment