budget estimations
-
Budget: తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయంటే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం కొంత వరాలు కురిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అవసరాలమేరకు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కావాల్సినవి.. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.683 కోట్లు కేటాయించాలి. ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు. మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి. ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు జరగాలి. హైదరాబాద్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి. తెలంగాణలో.. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి. ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు.. రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు కేటాయించాలి. రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి. కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి. రెండు రాష్ట్రాల్లో 5జీ కనెక్టివిటీ పూర్తిగా ఉండాలి. యూనిఫైడ్ కార్డు జారీ (ఆధార్, పాన్, వోటర్, ఈపీఎఫ్, రేషన్ కార్డులన్నింటికి ప్రత్యామ్నాయంగా ఒకే కార్డు) కావాలి. పెట్రోలు, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి. సీనియర్ సిటిజన్ల గరిష్ఠ పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి. ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి. స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు... అదుర్స్
న్యూఢిల్లీ: ఆర్థిక రికవరీకి సంకేతంగా మూడేళ్ల (2017–18) తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను) మొట్టమొదటిసారి బడ్జెట్ (2021–22) లక్ష్యాలను అధిగమించనున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. 2021–22 తొలి బడ్జెట్ అంచనాలు రూ.11.08 లక్షల కోట్లయితే, దీనిని తాజాగా రూ.12.50 లక్షల కోట్లకు సవరించడం జరిగింది.ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.20 లక్షల కోట్లుగా నమోదవుతాయని (రూ.7.20 లక్షల కోట్లు కార్పొరేట్ల నుంచి రూ.7 లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను) తాజా బడ్జెట్ అంచనావేసింది -
బడ్జెట్ అంచనాలపై కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాల మీద తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం రాజేంద్ర నగర్లో ఆయా శాఖాదిపతులతో జరిగిన సమావేశంలో బడ్జెట్ తీరు తెన్నుల మీద కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పంచాయితీరాజ్ శాఖకు మూసపద్దతిలో బడ్జెట్ అంచనాలు తయారు చేయకుండా అవసరాలకి అనుగుణంగా, తమ సామర్ధ్యం మేరకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు రాబోయే మూడు సంవత్సరాలకు ఉండాల్సిన విజన్ సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఇందులో భాగంగా ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు ఈ సంవత్సరం కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు.. పంచాయితీరాజ్ రోడ్లు ఇంజనీరింగ్ శాఖ బడ్జెట్ అంచానాలను కేటీఆర్కు వివరించారు. గత బడ్జెట్ లో ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఈ సారి ఎంత ఖర్చు ఉండబోతుందన్న అంశంపైన ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సారి బ్రిడ్జీల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి బిటి రోడ్డు కనెక్టీవిటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయితీరోడ్లను అవసరం ఉన్న చోట్ల విస్తరించాలన్నారు. ఇక రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఘానాన్ని వాడుకోవాలని, ఇందులో భాగంగా బైటెక్ కోల్డ్ మిక్స్, అర్బిఐ 81 వంటి సాంకేతిక పరిజ్ఞానాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులు డిజిటలైజ్ చేసేందుకు పంచాయితీరాజ్ అన్ లైన్ మానిటరింగ్ టూల్ రూపకల్పన ద్వారా పర్యవేక్షణకి సైతం ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్డబ్ల్యూయస్ అండ్ యస్ శాఖ ప్రతిపాదనలను సమీక్షించారు. ఈసారి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో అధికంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇక తాగునీటి సరఫరా, స్వచ్చ భారత మిషన్, ఎన్ఆర్డీడబ్ల్యూ వంటి వాటికి కేంద్రం నుంచి వచ్చే నిధులపైన మంత్రి అధికారులనుంచి వివరాలు తీసుకున్నారు. ఇక స్వచ్చ్ తెలంగాణలో (ఎస్బీఎమ్) భాగంగా ఏడు లక్షల 55 వేల టాయిలెట్స్ నిర్మాణానికి సైతం.. ఈసారి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.