
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్-నవంబర్ లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.4 శాతం పెరిగి 4.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. స్థూల వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ. 5.82 లక్షల కోట్లు వసూలయ్యాయి.
నవంబరు, 2017 నాటికి సీబీడీటీ గణాంకాల ప్రకారం వసూళ్లు 4.8 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గత ఏడాది కంటే 14.4 శాతం పుంజుకున్నాయి. 2017-18 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, ప్రత్యక్ష పన్నులు 49 శాతం (రూ 9.8 లక్షల కోట్లు) ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
2017 ఏప్రిల్-నవంబర్లో స్థూల వసూళ్లు (రీఫండ్లు కోసం సర్దుబాటు చేసే ముందు) 10.7 శాతం పెరిగి 5.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2017 ఏప్రిల్-నవంబర్లో రూ.1.02 లక్షల కోట్ల జారీ చేసినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment