risese
-
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్‌హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది. -
హెచ్‌యూఎల్ లాభాలు భళా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 2022–23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం (క్యూ1)లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పటికీ, వ్యయాలను సమర్థవంతంగా అధిగమించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,391 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.14,757 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.2,100 కోట్లు, ఆదాయం రూ.12,260 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 21% పెరిగి రూ.11,531 కోట్లకు చేరాయి. హోమ్‌కేర్ విభాగం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. రెండంకెల విక్రయాలు జరిగాయి. బలమైన పనితీరు.. ‘‘సవాళ్లతో కూడిన వాతావరణం, అసాధారణ స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రభావం వినియోగంపై ఉన్నప్పటికీ.. ఆదాయం, నికర లాభంలో బలమైన వృద్ధిని నమోదు చేశాం. వ్యాపారాన్ని కాపాడుకుంటూనే, మార్జిన్లను ఆరోగ్యకర స్థాయిలో కొనసాగించాం. ద్రవ్యోల్బణానికి సంబంధించి సమీప కాలంలో ఆందోళన ఉంది. అయితే, కమోడిటీల ధరలు కొంత దిగిరావడం, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, పరపతి చర్యలు, మంచి వర్షాలు పరిశ్రమకు సానుకూలిస్తాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతో కూడిన, లాభదాయక, బాధ్యతాయుత వృద్ధిని నమోదు చేయడంపై దృష్టి కొనసాగుతుంది’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. -
విడుదలైన క్యూ1 ఫలితాలు,వేల కోట్ల లాభాలతో పుంజుకున్న హెచ్‌పీసీఎల్!
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (క్యూ1) నికర లాభం 2.4% పుంజుకుని రూ.3,283 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మరింత అధికంగా 17 శాతం ఎగసి రూ. 23,464 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం స్థాయిలో వృద్ధి చూపగలదని కంపెనీ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. కరెన్సీలో నిలకడ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. డీల్స్ జోరు: ప్రస్తుత ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో, ఎండీ సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తంగా 2.7 శాతం వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. సర్వీసుల బిజినెస్ వార్షికంగా 19 శాతం పురోగతిని సాధించినట్లు వెల్లడించారు. డిజిటల్ ఇంజనీరింగ్, అప్లికేషన్ల సర్వీసులు, క్లౌడ్ వినియోగం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు వివరించారు. భారీ, మధ్యతరహా డీల్స్‌తో కొత్త బుకింగ్స్ 23.4 శాతం అధికంగా 2.04 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 17 శాతం నిర్వహణా మార్జిన్లను సాధించగా.. 6,023 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నట్లు తెలియజేశారు. గతేడాది క్యూ4లో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9% కాగా.. తాజాగా 23.8 శాతానికి పెరిగింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు దాదాపు 2% క్షీణించి రూ. 926 వద్ద ముగిసింది. -
షాకింగ్:రాకెట్లా పెట్రోల్,డిజీల్ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్ క్రూడ్ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. నిత్యం రూ.525 కోట్ల నష్టం.. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యారెల్ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ రోజువారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 65–70 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే. మరింత పెంచాల్సిందే..! ‘‘ముడి చమురు బ్యారెల్ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌పై రూ.13.10–24.90 మేర.. లీటర్ పెట్రోల్‌పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. క్రిసిల్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్‌కు లీటర్‌పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 55–560 మిలియన్ డాలర్ల మేర 2021 నవంబర్ – 2022 డిసెంబర్ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?
న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి. -
హెచ్డీఎఫ్సీ ఫలితాలు భళా: లాభం 20శాతం జంప్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. డిసెంబర్ 31తో ముగిసి క్యూ3 లో నికర లాభం భారీగా జంప్ చేసింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు నికర లాభం 20 శాతం ఎగిసి రూ. 4643 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 3,865 కోట్ల రూపాయలను ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 24 శాతం పెరిగి రూ. 10,314 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) స్వల్పంగా పెరిగాయి. గత క్వార్టర్1.26 శాతంతో పోలిస్తే ఈ క్వార్టర్లో 1.29 శాతానికి చేరాయి.. నికర ఎన్పీఏలు సైతం 0.43 శాతం నుంచి నామమాత్రంగా 0.44 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 1476 కోట్ల నుంచి రూ. 1351 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలోహెచ్డీఎఫ్సీ కౌంటర్ భారీ లాభాలతో రూ. 1958 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశ మార్కెట్ చరిత్రలో రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించిన మూడో సంస్థగా హెచ్డీఎఫ్సీ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
14శాతం పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్-నవంబర్ లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.4 శాతం పెరిగి 4.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. స్థూల వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ. 5.82 లక్షల కోట్లు వసూలయ్యాయి. నవంబరు, 2017 నాటికి సీబీడీటీ గణాంకాల ప్రకారం వసూళ్లు 4.8 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గత ఏడాది కంటే 14.4 శాతం పుంజుకున్నాయి. 2017-18 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, ప్రత్యక్ష పన్నులు 49 శాతం (రూ 9.8 లక్షల కోట్లు) ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2017 ఏప్రిల్-నవంబర్‌లో స్థూల వసూళ్లు (రీఫండ్లు కోసం సర్దుబాటు చేసే ముందు) 10.7 శాతం పెరిగి 5.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2017 ఏప్రిల్-నవంబర్‌లో రూ.1.02 లక్షల కోట్ల జారీ చేసినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. -
జీడీపీ జోష్‌తో మార్కెట్లు డబుల్ సెంచరీ
ముంబై: జీడీపీ గణాంకాల జోష్‌తో దేశీయస్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచే పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు డబుల్ సెంచరీ సాధించి జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక పురోగతి అంచనాలను మించడంతో ప్రస్తుతం సెనెక్స్ 223 పాయింట్లు ఎగిసి 28,967 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 8939 వద్ద కొనసాగుతున్నాయి. దలాల్ స్ట్రీట్ ఊహించిన దానికంటే మూడవ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 8,950ని అధిగమించేందకు సిద్ధంగా ఉంది. క్యూ3లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7 శాతం వృద్ధి సాధించడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గత రెండు నెలల్లో (డిసెంబర్ మరియు జనవరి) లో రూ. 14,000 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోళ్లు మార్కెట్‌కు ఊతమిచ్చాయంటున్నారు. మదుపర్ల కొనుగోళ్లతో దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లులాభాలకు తోడు రియల్టీ, మెటల్, బ్యాంక్ నిఫ్టీ కూడా లాభపడుతున్నాయి. ఇన్ఫ్రాటెల్, యాక్సిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, హిందాల్కోలాభాల్లోనూ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐడియా, ఎంఅండ్ఎం, అంబుజా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు పసిడి బులియన్ మార్కెట్లో వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా నే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.191 క్షీణించి రూ.29,375 వద్ద ఉంది. రూపాయి కూడా 0.16పైసలు నష్టపోయి రూ.66.85 వద్ద వుంది.