‘నోబెల్‌’ నగదు పురస్కారం భారీగా పెంపు | Nobel Foundation Raises The Amount For This Year Nobel Prize Awards - Sakshi
Sakshi News home page

Nobel Awards 2023 Cash Prize: ‘నోబెల్‌’ నగదు పురస్కారం భారీగా పెంపు

Published Sat, Sep 16 2023 5:45 AM | Last Updated on Sat, Sep 16 2023 9:12 AM

Nobel Foundation raises the amount for this year Nobel Prize awards - Sakshi

స్టాక్‌హోమ్‌: నోబెల్‌ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్‌ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్‌ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్‌ కరెన్సీ క్రోనార్‌ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది.

అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్‌ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్‌లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్‌ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్‌ ఫౌండేషన్‌ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్‌ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement