Nobel
-
సాహిత్య సందడి
సాహిత్యం వార్త కావడం అరుదు. కానీ సాహిత్యం వార్తగా మారిన ప్రతిసారీ సమాజం ఇంకొంత సానుకూలంగా కనబడుతుంది. మనుషుల్లోని చీకటి వెలుగుల మీద, రక్తమాంసపు ఉద్వేగాల మీద చూపు ప్రసరిస్తుంది. విచికిత్సకూ, నెమ్మదితనానికీ వీలు చిక్కుతుంది. సాహిత్యం వార్తగా మారకపోవడానికి ప్రధాన కారణం, సాహిత్యంలో ఏమీ జరుగుతున్నట్టు కనబడకపోవడం. ఒక రచయిత తన పుస్తకంలోని మొదటి అధ్యాయం అయిందని ప్రెస్ మీట్ పెట్టడు. ఇందాకే ఈ వాక్యం తట్టిందని బహిరంగ ప్రకటన చేయడు. అదంతా ఎప్పటికో తుదిరూపు దిద్దుకునే వ్యవహారం. అప్పుడు మాత్రం హడావిడి ఏముంటుంది? అయితే సాహిత్యమే వార్తగా మారే సందర్భాలు లిటరేచర్ ఫెస్టివల్స్ కలిగిస్తాయి. పదుల కొద్దీ రచయితలు, వందల కొద్దీ పుస్తకాలు, చర్చోపచర్చలు, ముఖాముఖి సంభాషణలు, ఇన్ ఫోకస్ అంశాలు, వెరసి విస్మరించలేని వార్త అవుతాయి. సాహిత్యం సందడిని కోరదు. ఏకాంతమే దానికి తగినది. కానీ రణగొణ ధ్వనుల్లో చిక్కుకున్నవారిని ఏకాంతపు ఒడ్డును చేర్చడానికి అవసరమైనంత సందడిని సాహిత్య వేడుకలు పుట్టిస్తాయి.సంవత్సరంలో పతాక శీర్షికలకెక్కేంత వార్త నోబెల్ పురస్కార ప్రకటన. అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ ప్రకటించడంతో సాహిత్య వాతావరణం చురుగ్గా మారిపోయింది. ఆమె పుస్తకాల మీద ఎనలేని ఆసక్తి మొదలైంది. దీనికంటే ముందు సెప్టెంబర్ నెల చివర్లో, 28, 29 తేదీల్లో రెండ్రోజుల ‘సౌత్ ఏసియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్’ అమెరికాలో జరిగింది. ‘సమాజంలో బహుళత్వం’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో శశి థరూర్ సహా ప్రపంచవ్యాప్త రచయితలు పాల్గొన్నారు. అక్టోబర్ 16–20 వరకు ఐదు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన సుమారు నాలుగు వేల స్టాళ్లతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ‘ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్’ జరిగింది. గెస్ట్ ఆఫ్ హానర్: ఇటలీ. పొరుగునే ఉన్న ‘కర్ణాటక తుళు సాహిత్య అకాడెమీ’ తుళు భాష మీద మరింత అవగాహన కలిగించేలా, కొత్త తరానికి దాన్ని చేరువ చేసేలా అక్టోబర్ నెలలోనే ఒక కార్యక్రమం చేపట్టింది. కశ్మీర్ సాహిత్యం, సంస్కృతిని ఉత్సవం చేసే లక్ష్యంతో ‘మారాజ్ అద్బీ సంగం’ జరిపే వార్షిక సాహిత్య సదస్సు కూడా అక్టోబర్‌లోనే జరిగింది. అక్టోబర్‌లోనే 25 లక్షల రూపాయలతో దేశంలో అత్యంత ఖరీదైన పురస్కారంగా ఉన్న జేసీబీ ప్రైజ్ కోసం ఐదు నవలల షార్ట్ లిస్ట్ వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని వేడుక చేస్తున్న ఈ పురస్కారం కోసం రెండు ఆంగ్ల నవలలతో సహా మలయాళీ, బెంగాలీ, మరాఠీ రచనలు తుది జాబితాలో ఉన్నాయి.పురస్కార ప్రకటన నవంబర్ 23న జరగనుంది. ‘ఆటా గలాటా బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్’ కూడా పిల్లల పుస్తకాల అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ ప్రకటించింది. విజేతలను డిసెంబర్ 14, 15 తేదీల్లో జరిగే వేడుకల్లో ప్రకటిస్తారు. అక్టోబర్ నెల ఇచ్చిన ఊపును ఏమాత్రం తగ్గించకుండా నవంబర్‌లో ‘ద డెహ్రడూన్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆరవ ఎడిషన్ 8–10 తేదీల వరకు జరిగింది. ‘సాహిత్యం, సమాజం, సినిమా’ పేరుతో జరిగిన ఇందులో రజిత్ కపూర్, సల్మాన్ ఖుర్షీద్, జెర్రీ పింటో, ఇంతియాజ్ అలీ లాంటివాళ్లు పాల్గొన్నారు. ఒక్కోసారి ఊరికే వార్తలు వల్లెవేసుకోవడం కూడా ఉత్సాహంగా ఉంటుందని ఈ సాహిత్య ఉత్సవాలు తెలియజెబుతున్నాయి.ఇక, ‘ముంబయి లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 15–17 వరకు జరగనుంది. 2010 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈసారి గుల్జార్, విలియం డాల్రింపుల్ సహా 13 దేశాలకు చెందిన రచయితలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రత్యేకం మహా కథకుడు ఫ్రాంజ్ కాఫ్కా ‘ద మెటమార్ఫసిస్’ను ఫోకస్ పుస్తకంగా తీసుకోవడం. నలభై ఏళ్లకే కన్నుమూసిన చెక్ రచయిత కాఫ్కా (1883–1924) నూరవ వర్ధంతి సంవత్సరం ఇది.‘ద మెటమార్ఫసిస్’లోని మొట్టమొదటి వాక్యమే తన సాహిత్య ప్రస్థానానికి ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆరాధనగా చెబుతారు లాటిన్ అమెరికా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’’ అంటారు. అలాంటి మెటమార్ఫసిస్‌కు డిజిటల్ రిక్రియేషన్ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, నేరము–సినిమా నేపథ్యంలో విభిన్నమైన ‘క్రైమ్ లిటరేచర్ ఫెస్టివల్’ నవంబర్ 29 నుంచి మూడ్రోజుల పాటు డె్రçహాడూన్లో జరుగుతుండటం దీనికి కొనసాగింపు. ప్రకాశ్ ఝా, సుజయ్ ఘోష్, హుస్సేన్ జైదీ లాంటివాళ్లు మాట్లాడుతారు. లోకంలో ఇంత జరుగుతున్నప్పుడు, కోట్ల జనాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరగట్లేదని నిందించడానికి అవకాశం ఉందిగానీ, రవి మంత్రి తొలి నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ లక్ష కాపీలు అమ్మిన మైలురాయిని ఈమధ్యే చేరుకుంది. ‘అజు పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ నవలతో పుస్తకాలు చదవడం మరిచిపోయిందనుకున్న ‘ఇన్‌స్టా తరం’ కొత్త ఆశలను రేపింది. ఇక, పది రోజుల పుస్తకాల పండుగలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ వచ్చే నెలలో మొదలవుతుంది. అది పూర్తవుతూనే ‘విజయవాడ బుక్ ఫెయిర్’ జరుగుతుంది. దాని అనంతరం ‘హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్’ ఉండనేవుంది. ఈ సద్దు ఆగేది కాదు. ఈ సందడిలో భాగం కావడమే మన వంతు. -
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్‌హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది. -
నోబెల్ పురస్కారానికి మోదీ నామినెట్..!
సాక్షి, చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆవిష్కరించిన మోదీకి నోబెల్ ఇవ్వాలని.. ఆ మేరకు ఆయన పేరును నోబెల్ కమిటీకి ఆమె నామినెట్ చేశారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని కోరారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం రాంచీలో అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ ప్రచారం చేస్తోంది. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేర్చనున్నారు. -
పాకిస్తాన్ ప్రధానినవుతా!
దావోస్: ఓ బాలిక తనకు రాసిని ఉత్తరంలో భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని పాకిస్తానీ యువతి మలాలా యూసఫ్ జాయ్ గుర్తు చేసుకుంది. బాలిక విద్య కోసం పోరాడుతున్న మలాలా త్వరలోనే భారత పర్యటనకు వస్తానని ప్రకటించింది. 15 ఏళ్ల ప్రాయంలో పాకిస్తాన్లో బాలిక విద్య కోసం పోరాడుతున్న క్రమంలో ఆమెపై ఉగ్రమూకలు హత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మలాలా బ్రిటన్ వేదికగా బాలికల సమస్యలపై పోరాడుతోంది. గుల్‌మకాయ్ పేరుతో సంస్థను స్థాపించి బాలిక విద్య కోసం నిధులు సేకరిస్తోంది. ఇందులోభాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లోనూ పాల్గొంది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి గ్రహీత మీడియాతో మాట్లాడింది. తన సంస్థ గుల్‌మకాయ్ విస్తరణ కోసం ఇండియాలో పర్యటించాలని అనుకుంటున్నానని మలాలా వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు ఉత్తరాలు రాసి తన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారిచ్చే ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేమని కొనియాడింది. పాకిస్తాన్ ప్రధానినవుతా! తనకు భారత్ అంటే చాలా ఇష్టమని మలాలా చెప్పింది. భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూసి హిందీ నేర్చుకున్నానని తెలిపింది. తనకు ఉత్తరం రాసిన ఓ బాలిక భవిష్యత్తులో తాను ఇండియాకు ప్రధానమంత్రిని అవుతానని చెప్పిందని గుర్తు చేసుకుంది. ఆ ఉత్తరం తన హృదయాన్ని తాకిందని చెప్పింది. నేటి బాలికల ఉన్నత ఆశయాలకు ఈ ఉత్తరమే నిదర్శనమని ప్రశంసించింది. తాను కూడా పాకిస్తాన్‌కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇండియాలోని బాలికల కోసం కూడా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘‘భావితరాలకు బాలికలే భవిష్యత్తు అన్న సంగతి మరువద్దు. కేవలం వారికి విద్యనందిస్తే సరిపోదు, వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని సూచించింది. -
ధైర్యానికి నోబెల్!
కంగ్రాట్స్ మలాలా మలాలా డిగ్రీ కంప్లీట్ అయింది! చచ్చి బతికాక, ఆమె చదువు ఆపకుండా ధైర్యంగా డిగ్రీ పూర్తి చేసింది. అందుకే ఇది మలాలాకు మరో నోబెల్ లాంటిది. ఇవాళ మలాలా యుసాఫ్జాయ్ బర్త్ డే. 20 నిండి 21లోకి వచ్చేసింది. మలాలా జీవితంలో ఈ నెలకు ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితమే మలాల డిగ్రీ పూర్తయింది. అదే రోజు (జూలై 7) మాలాల ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం అయింది. ఆమె ‘హాయ్.. ట్విట్టర్’ అని ట్వీట్ చేయగానే మొదటి మూడు గంటల్లో లక్షా 34 వేల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్‌కు జత అయ్యారు. అది కాదు విశేషం. కొన్ని గంటల్లోనే కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మొదలుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వరకు ఎంతో మంది దేశాధినేతలు ట్విట్టర్లో ఈ అమ్మాయికి ‘హృదయపూర్వక స్వాగతం’ పలికారు. బాలికల విద్య కోసం, మహిళలకు సమానత్వం కోసం మలాలా పాటు పడుతున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ కాలేజీ నుంచి చివరి పరీక్ష రాసి బయటికి వస్తూ.. తన డిగ్రీ ఒక ‘బిట్టర్ స్వీట్’ అని ఆమె అన్నారు. తాలిబన్ తీవ్రవాదులు మలాలా పై కాల్పులు జరిపిన అనంతరం బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స జరిగింది. తలలో దిగబడిన బుల్లెట్‌ను బయటికి తీసి వైద్యులు అతి కష్టం మీద ఆమె ప్రాణాలను కాపాడారు. పాక్‌లోని స్వాత్ లోయ మలాలా స్వగ్రామం. 2012 అక్టోబరులో ఓ రోజు స్కూలు బస్సులో వెళుతున్న పదిహేనేళ్ల మలాలాపై తాలిబన్లు కాల్పులు జరిపారు. బాలికలు చదువుకోడానికి వీల్లేదని తాలిబన్లు విధించిన నిషేధాజ్ఞల్ని ధిక్కరించి మరీ మాలాలా బయటికి వచ్చి చదువుకోవడం, మిగతా బాలికల్ని కూడా ధైర్యంగా బయటికి వచ్చి చదువుకొమ్మని పిలుపు ఇవ్వడం.. ఈ రెండు ‘తప్పులకు’ పడిన శిక్షే.. ఆమెపై కాల్పులు! తాలిబన్ల దాడి తర్వాత గాయాల నుంచి తేరుకుని మలాల మరింత కృత నిశ్చయంతో బాలిక చదువు కోసం కృషి చేశారు. ఓ పెద్ద ఉద్యమమే చేపట్టారు. అక్షరాలే ఆమె ఆయుధాలు. స్ఫూర్తి? ఇంకెవరు? మలాల జీవితమే. ఈ క్రమంలోనే 2014లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం మలాలా పూర్తి చేసిన డిగ్రీ పరీక్షల ఫలితాలు వచ్చే నెల వెల్లడి అవుతాయి. ఆ లోపే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆమె ఆహ్వానం అందింది! ఆక్స్‌ఫర్డ్‌లో మలాలా పి.పి.ఇ. చదవాలనుకుంటున్నారు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్. బ్రిటన్‌లోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాల అధినేతలు, చివరికి మలాలా స్వదేశీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో కూడా ఈ కోర్సును చదివిన వారే. చేతికి రాబోతున్న డిగ్రీని మలాల ‘బిట్టర్ స్వీట్’ అని అనడానికి తగిన కారణమే ఉంది. తనకన్నా ఎంతో మంది తెలివైన అమ్మాయిలు, ఆశ ఉండీ, అవకాశం లేక చదువుకోలేకపోతున్నారు కనుకనే ఈ సంతోషాన్ని ఆమె సంపూర్ణంగా ఫీల్ అవలేకపోతోంది. కానీ ఆమె విజయాన్ని ప్రపంచం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ‘‘విద్య, సమానత్వాల కోసం జరిగే పోరాటంలో బాలికలకు వాళ్ల గళాలే అత్యంత శక్తిమంతమైన ఆయుధాలు. ప్రతి బాలికలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది’’ అని కూడా మలాలా ట్వీట్ చేశారు. ఈ ఒక్కమాట చాలు.. బాలికలకు విద్యను, సమానత్వాన్ని నిరాకరించే సమాజాలకు తూటాలా తగలడానికి. మలాలా–మరి కొన్ని విశేషాలు ► మలాలాపై దాడి అనంతరం పాకిస్తాన్లో తొలిసారిగా ‘రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు’ అమల్లోకి వచ్చింది. ► నోబెల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో శాంతి బహుమతి అందుకున్నారు మలాలా. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. ► ‘ఐ యామ్ మలాలా : ది గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వాజ్ షాట్ బై ది తాలిబన్’ అనే పుస్తకాన్ని తన గురించి స్వయంగా రాసుకున్నారు మలాలా. ►యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజీ మలాలాకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందజేసింది. ►ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2, ఒబామా, జస్టిన్ బీబర్లతో ముఖాముఖి సంభాషించారు. -
‘నోబెల్’కు నగుబాటు!
నోబెల్ సాహిత్య బహుమతిని మేటి పాటగాడు బాబ్ డిలన్‌కు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఆయన నుంచి ఏ జవాబూ లేక తలకొట్టేసినట్టయిన నోబెల్ కమిటీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా రూపంలో మరో ఝలక్ తగిలింది. 2009లో తనను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ తెలియదని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానం... ఆ కమిటీ తీరు తెన్నుల గురించి ఎన్నాళ్లనుంచో వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. ఏమాట కామాటే చెప్పుకోవాలి. పురస్కార గ్రహీతల యోగ్యతాయోగ్యతల మాట అటుంచి... అలా ఎంపికైనవారిని ఎవరైనా అభినందిస్తారు. అలాగని అత్యధికుల అంచనాలకు దీటుగా లేని సందర్భాల్లో విమర్శలు రావడం కూడా సర్వసాధారణం. కానీ ఒబామాకు శాంతి బహుమతిని ప్రకటించాక విస్తుపోతూ ప్రకటనలు చేసిన వారే అధికం! మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, మదర్ థెరిసా, దలైలామా వంటి దిగ్గజాల సరసన ఆయనను కూర్చోబెట్టడమేమిటని కొందరు ఆగ్రహించారు కూడా! వీటన్నిటా సహేతుకత ఉంది. నోబెల్ బహుమతి ప్రకటించేనాటికి ఒబామా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలలు మాత్రమే అయింది. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లు పంపడానికి గల తుది గడువునాటికైతే ఆయన అధికారంలోకొచ్చి పట్టుమని పక్షం రోజులు కూడా కాలేదు. ఆ రెండు వారాల్లో నోబెల్ కమిటీ ఆయనలో ఏం సుగుణాలు చూసిందో, ప్రపంచశాంతి స్థాపన కోసం ఆయన ఏం చేశారనుకున్నదో తెలియదు. తనను ఆ పురస్కారానికి ఎంపిక చేయ డాన్ని స్వాగతిస్తూ ‘విశ్వమానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ బహుమతి ధ్రువీకరిస్తున్నద’ంటూ ఒబామా అప్పట్లో గొప్పలుపో యారు. ఎనిమిదేళ్లు గడిచాకైనా ఆయన నిజం పలికారనుకోవాలి! ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ‘కేవలం ఆయన బుష్ కాకపోవ డమే’ కారణమని అప్పట్లో ఒకరు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానంలో వాస్తవం ఉంది. నోబెల్ కమిటీకి ఎందుకనో జార్జ్ బుష్ పొడగిట్టదు. పదవిలో ఉన్నప్పుడు, దిగిపోయాక కూడా ఆయనంటే తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఆయన వ్యతిరేకులన్న ముద్ర ఉంటే శాంతి బహుమతి ఇచ్చేవారన్న విమర్శ ఉండేది. అందుకు కొన్ని రుజువులున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు 2002లో శాంతి పురస్కారాన్ని ప్రకటించేనాటికి ఆయన బుష్‌కు వ్యతిరేకంగా... మరీ ముఖ్యంగా అప్పట్లో జరిగిన ఉగ్రదాడిపై బుష్ స్పందించిన తీరును దుయ్యబట్టారు. పదవీ విరమణ చేశాక ఆయన స్థాపించిన ఫౌండేషన్ హైతీ, బోస్నియా తదితర దేశాల్లో శాంతి స్థాపనకు, ఇజ్రాయెల్-పాలస్తీనాలమధ్య శాంతి చర్చలు ఫలవంతం కావడా నికి తోడ్పడిందని నోబెల్ కమిటీ చెప్పినా అసలు సంగతి ఆయనలో ఉన్న బుష్ వ్యతిరేకతే అంటారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అఫ్ఘాన్‌లో ముజాహిదీన్లకు ఆయు ధాలందించి, ఈనాటి ఉగ్రవాదానికి బీజం వేసింది కార్టరే. దేన్నయినా సాధించార నుకున్న సందర్భంలోనే ఏ బహుమతైనా ఇవ్వడం సంప్రదాయం. ఇవ్వదల్చుకున్న వారికి అలాంటి గొప్పదనం ఆపాదించడంలో నోబెల్ కమిటీ ఆరితేరింది. 1919లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌కు, 1973లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు నోబెల్ కమిటీ వారిని ఆకాశానికెత్తింది. యుద్ధోన్మాదులుగా వారి చరిత్రను మరుగుపరచాలని చూసింది. కానీ ఒబామా విషయంలో ఆపాటి కష్టమైనా పడకుండా బహుమతిని ప్రకటించి రికార్డు సృష్టించింది. ప్రశంసా వాక్యాల్లో శాంతి సాధనకు ఒబామా చేసిన దేమిటో ప్రస్తావించకుండా, కేవలం‘ప్రయత్నాలను’ మెచ్చుకోవడంతో సరి పెట్టింది. కనీసం ఆ ప్రయత్నాలు దేనికి దారితీస్తాయో, ఒకవేళ అవి విఫలమైన పక్షంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలుసుకోవాలన్న స్పృహ కూడా నోబెల్ కమిటీకి లేకపోయింది. హడావుడి పడకుండా మరికొన్నాళ్లు ఆగి ఉంటే ఆ ‘ప్రయత్నాల’ అసలు రంగు కూడా వెల్లడయ్యేది. బుష్ ప్రారంభించిన యుద్ధాలను ఒబామా మరింత ముందుకు తీసుకెళ్లారు. కొత్త యుద్ధ రంగాలనూ తెరిచారు. ‘ఆయనకు శాంతి పురస్కారం ఇవ్వడం ఘోర తప్పిదమే’నని ఆ సమయంలో నోబెల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గీర్ లెండ్స్టెడ్ నిరుడు అంగీకరించారు. లిబియాపై బాంబుల వర్షం, సిరియాలో వరస దాడులు ఎన్ని వేలమంది ప్రాణాలు తీశాయో ఎవరూ మరిచిపోలేరు. అఫ్ఘానిస్తాన్, సోమాలియా, పాకిస్తాన్ తదితర చోట్ల ఉగ్రవాదుల్ని గురిపెట్టామనుకుని సాధారణ పౌరులను వందల్లో హతమా ర్చారు. ప్రపంచంలో ప్రశాంతత నెలకొల్పుతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒబామా ఆ తర్వాత సరిగ్గా అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు. కనీసం నోబెల్ శాంతి పురస్కారం వచ్చినందుకైనా అందుకు తగినట్టు ప్రవర్తించా లని ఆయన అనుకోలేదు. మహాత్మా గాంధీకి నోబెల్ ఇవ్వాలంటూ అయిదు దఫాలు నామినేషన్లు వెళ్లినా నోబెల్ కమిటీ పట్టనట్టు ఉన్న సంగతిని ఎవరూ మర్చిపోరు. 1948లో ఆయనకు శాంతి బహుమతి ప్రకటిద్దామనుకుంటుండగా గాంధీజీ హత్య జరిగిందని అది ఇచ్చిన సంజాయిషీలో నిజమెంతో తెలియదు. మరణానంతరం ఇచ్చే సంప్రదాయం లేదని అప్పట్లో చెప్పింది. కానీ స్వీడన్ మంత్రిగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాగ్ హమర్స్కోల్డ్కు 1961లో మరణానంతరం శాంతి పురస్కారం ఇచ్చింది. ఒక్క శాంతి బహుమతి విషయంలోనే కాదు...ఇతర రంగాల్లో ఇచ్చే పురస్కారాల విషయంలో సైతం కమిటీపై ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో ఒక్కరంటే ఒక్కరైనా మహిళ లేక పోవడాన్ని చాలామంది విమర్శించారు. అర్హులు లేరని కాదు. అనేకమంది మహి ళల పేర్లు నోబెల్ కమిటీ పరిశీలనకొచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ఈసారి మన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు కనుగొన్న అంశాలకు అనుకూలంగా అత్యధిక నామినేషన్లు వెళ్లినా కమిటీ పరిగణించలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటి తడబాట్లకు నోబెల్ కమిటీ స్వస్తి చెప్పడానికి ఒబామా ‘ఒప్పుకోలు’ ప్రకటన పనికొస్తే మంచిదే! -
నోబెల్ చాక్లెట్!
హ్యూమర్ ప్లస్ ‘నాన్నా... చాక్లెట్ కనిపెట్టిన వారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారా?’’ అని అడిగాడు మా బుజ్జిగాడు. ‘‘లేదనుకుంటారా’’ అన్నాను. వాడి ముఖంలో కాస్త అసంతృప్తి కనిపించింది. ‘‘నువ్వు నోబెల్ ప్రైజ్ వాళ్లకు వెంటనే మెయిల్ పెట్టు. దాన్ని కనిపెట్టిన వాళ్లకు అర్జెంటుగా ఇవ్వమని చెప్పు’’ అంటూనే ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ చేతితో తల తాటించుకున్నాడు. ‘‘ఆ... గుర్తొచ్చింది. అన్నట్టు... ‘వెన్నతో పెట్టిన విద్య’ అని మొన్న నువ్వు సామెత చెప్పావు కదా. దానికి బదులు చాక్లెట్‌తో పెట్టిన విద్య అని చెప్పాల్సింది. కొంతమంది పిల్లలకు వెన్న అంతగా నచ్చదు. అదే చాక్లెట్ అనుకో... అందరికీ టేస్టీగా అనిపిస్తుంది’’ అంటూ హడావుడిగా ఆడుకోడానికి వెళ్తున్న టైమ్‌లోనే మా రాంబాబు గాడు జోక్యం చేసుకున్నాడు. వాడు ఇంటర్ఫియర్ ్ఞఅయ్యాడంటేనే నాకు ఫియర్. ‘‘బుజ్జిగాడు చెబుతున్న మాటలు సత్యం రా. అన్నట్టు పిల్లలకు చదువు చాలా స్వీట్ అండ్ టేస్టీగా రావాలనీ చాక్పీసులోని ఫస్ట్ హాఫ్‌కు ఆ పేరు పెట్టారంటావా?’’ అడిగాడు. ‘‘అరేయ్... అది చాక్. సీహెచ్ఏఎల్కే చాక్. ఎల్ సెలైంటు. స్పెల్లింగ్ నేర్చుకో. చాక్ అంటే సున్నం. చాక్లెట్కూ దానికీ సంబంధం లేదు. ఇది వేరే ’’ వాడిని సరిదిద్దడానికి ప్రయత్నించా. ‘‘పిల్లలకు ఎక్కువ పదాలు నేర్చుకోవడం కష్టమవుతుందనీ, ఈజీగా ఉండాలని అలా స్పెల్లింగు మార్చారేమో?’’ సందేహం వెలిబుచ్చాడు. ‘‘ఒరేయ్... నీకు చాక్లెట్ల మీద మోజు మరీ పెరిగి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్. అయినా నీ ఇష్టమొచ్చినట్టు చాక్లెట్లు తినడానికి నీది మన బుజ్జిగాడి ఏజ్ కూడా కాదు. వయసు పెరుగుతోంది. హెల్త్ కోసమైనా చాక్లెట్లు కాస్త తగ్గించు’’ వాడి వాదనకు కోపం వచ్చి నేను వాడిని కోప్పడ్డాను. ‘‘పిచ్చివాడా... డార్క్ చాక్లెట్స్ గుండెకు మంచిది. నీకో విషయం తెలుసా. తినకుండా మనసు అదుపులో పెట్టుకుంటూ, షుగర్ ఉన్నవాళ్లు కూడా ఎప్పుడూ కొన్ని చాక్లెట్స్ స్పేర్‌లో పెట్టుకోవాలి. అది వాళ్లకు ఫస్ట్ ఎయిడ్... తెలుసా?’’ అన్నాడు కూల్‌గా. ‘‘చాక్లెట్ ఫస్టెయిడా?’’ ఆశ్చర్య పడ్డాను. ‘‘అవును. షుగర్ ఉన్నవాళ్లలో ఒక్కోసారి అనుకోకుండా షుగర్ లెవల్స్ పడిపోతుంటాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ చాక్లెట్ దగ్గర పెట్టుకోవాలి. బాగా నీరసంగా అనిపిస్తే, గుటుక్కున చాక్లెట్ నమిలాకే, నింపాదిగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. అన్నట్లు నీకో సెన్సార్డ్ సంగతి తెలుసా?’’ అన్నాడు వాడు. ‘‘ఏమిట్రా?’’ అని అడిగా. ‘‘ప్రేమికుల మధ్యన ముద్దుల తర్వాత ఎక్కువగా ఎక్స్ఛేంజ్ అయ్యేది కేవలం చాక్లెట్లే. పైగా కిస్సుతో ఒంట్లో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో చాక్లెట్స్‌తోనూ అలాంటి అనుభూతులే వస్తాయట. ఒక్క ప్రేమికులనే ఏమిటిలే... హోదాల్లో పెద్ద పెద్ద వాళ్లు... తమకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వచ్చిన తమ సబార్డినేట్లకూ, సహచరులకూ గిఫ్టుగా ఇచ్చేది చాక్లెట్లే. ఎందుకంటే చాక్లెట్లు ప్రేమను బాగా పెంచుతాయట. అంతెందుకు మన దగ్గర శుభకార్యాల్లో నోరు తీపి చేయడం అనే సంప్రదాయం ఉంది. ఆ పని చేసిన పుణ్యమే ఒకాయనను రక్షించింది తెలుసా?’’ అన్నాడు. ‘‘తీపి తినిపించిన పుణ్యం ప్రాణాలు కాపాడిందా?’’ ‘‘అవున్రా. మిల్టన్ హెర్షీ అనే ఆయన చాక్లెట్ల కంపెనీ పెట్టి కోట్ల మంది నోరు తీపి చేశాట్ట. ఆ పుణ్యం వల్లే... లాస్ట్ మినిట్‌లో టైటానిక్ షిప్ మిస్సయ్యాడట’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాల్రా’’ అన్నాను నేను. ‘‘సారీ... నాకు కావాల్సింది చాక్ ట్రీట్మెంట్. అయినా... ముందుగా బుజ్జిగాడు చెప్పినట్టు చాక్లెట్ కనిపెట్టిన వాడికి నోబుల్ ప్రైజు ఇవ్వమని డిమాండు చేస్తూ ఒక లెటర్ రాయి. ఎస్సెమ్మెస్‌లు పంపు. ఇవీ సరిపోవు కాబట్టి ఫేస్బుక్లో ఒక ఉద్యమం నడుపు. అన్నట్టు... చాక్లెట్ కనిపెట్టిన వాడికి ఇంకా నోబెల్ ప్రైజు రాలేదేమోగానీ... చాక్లెట్లు తెగ తినే దేశాలకు చెందిన సైంటిస్టులకే ఎక్కువ నోబెల్ ప్రైజులు దక్కాయి. చాకొలేట్ అనే పదంలోని సెకండాఫ్‌లో లేట్ అని ఉన్నా... దాన్ని తినడంలో మాత్రం ఎంతమాత్రమూ లేట్ చేయకూడదు’’ అంటూ చాక్లెటు రేపర్ విప్పి, గబుక్కున నోట్లో పెట్టుకొని కసుక్కున్న కొరికాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
‘వినియోగ’ నిపుణుడికి నోబెల్
బ్రిటన్-అమెరికన్‌కు ఆర్థిక శాస్త్ర పురస్కారం పేదరికం, సంక్షేమం, వినియోగాంశాలపై అధ్యయనానికి.. స్టాక్‌హోం (స్వీడన్): పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో మార్పుకు, ఆర్థికశాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘‘పేదరికాన్ని తగ్గించి సంక్షేమాన్ని ప్రోత్సహించేలా ఆర్థిక విధానాలను రూపొందించాలంటే తొలుత వ్యక్తిగత వినియోగ అభిరుచుల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని అర్థాన్ని అందరికంటే ఎక్కువగా డేటన్ వివరించారు’’ అని అకాడమీ కితాబిచ్చింది. 1980లో తన సహచర ఆర్థికవేత్త జాన్ మల్బార్తో కలసి వివిధ వస్తువులకు ఉండే డిమాండ్‌ను అంచనా వేసినందుకు, 1990లో వినియోగం, ఆదాయానికి మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం చేసినందుకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీవన ప్రమాణాలను కొలిచేందుకు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఇంటింటి సర్వేల ద్వారా ఆయన సాగించిన అధ్యయనాలకుగాను డేటన్ను ఈ గౌరవానికి ఎంపిక చేసింది. డేటన్ 1983 నుంచి అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర, అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అవార్డు కింద ఆయనకు సుమారు రూ.6.15 కోట్ల నగదు అందనుంది. -
'ఒబామాకు నోబెల్ ఇవ్వడం ఓ పెద్ద తప్పిదం'
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపట్ల నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒబామాను మరింత ప్రోత్సహించేలా ఉంటుందని భావించాము. కమిటీ ఏమైతే ఆశించి ఒబామను 2009 నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసిందో..దాంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఒబామా కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం నమ్మలేక పోయాడని తెలిపారు. 2009లో నోబెల్ శాంతికి ఒబాను ఎంపిక చేయడం మీద జరిగినంత చర్చ.. మరే సంవత్సరానికి ఎంపిక అయిన వారి మీద జరగలేదన్నారు. చాలా మంది ఒబామా అనుచరులు కూడా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక తప్పిదంగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. నోబుల్ శాంతి బహుమతికి అతను అర్హుడు కాదని యూఎస్ లోని చాలా మంది అభిప్రాయపడ్డారని తెలిపారు. -
చరిత్ర ఆరాధన.. జ్ఞాపకాల ఆవాహన
చాలామంది రచయితల మాదిరిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేకమయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు. కాలం వెలిగించిన జ్ఞాపకాలు మనిషి గుండె చిమ్నీ లోపల, తగ్గించిన ఒత్తుల్లా మినుకుమినుకుమం టూనే ఉంటాయి. అలాంటి వెలుగులలో రచనా వ్యాసంగాన్ని సాగించిన మహా రచయితలు ఎం దరో ఉన్నారు. నాజీల దురాక్రమణలలో కోల్పో యిన తన వారి అస్తిత్వం, తన జాతి నేపథ్యం; చరిత్ర విస్మరించలేని ఒక మహా ఉన్మాదం, ఇవన్నీ మిగిల్చిన విషాద జ్ఞాపకాలే చోదకశక్తులుగా రచ నలు సాగించిన మరో అద్భుత రచయిత పాట్రిక్ మొడియానో. కళా తాత్వికతలకీ, విప్లవాలకీ, ప్రపం చాన్ని కదిపి కుదిపిన సాహిత్యోద్యమాలకీ పురుడు పోసిన ఫ్రాన్స్‌లో పుట్టినవాడాయన. ఈ సంవ త్సరం సాహిత్య నోబెల్ ఆయననే వరించింది. మొడియానో మిగిలిన ప్రపంచానికి పెద్దగా తెలియ కపోయినా ఫ్రాన్స్‌లో ఆరాధనీయుడు. నరక కూపాల వంటి నాజీల మృత్యు శిబిరాలలో వినిపిం చిన నిస్సహాయ యూదుల చావు కేకలు, అపహ రణకు గురైన తమవారి కోసం జరిగిన వెతుకులాట ఆయన అక్షరాల నిండా వినిపిస్తాయి. మరుగున పడిన జీవితచిత్రాలను స్మృతులతో తట్టి లేపిన రచయిత మొడియానో. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు మాసాల తరువాత (జూలై 30, 1945) పుట్టిన మొడియానో, 1940-44 మధ్య ఫ్రాన్స్ హిట్లర్ దురాక్రమణ కింద ఉన్న కాలంలో నలిగిపోయిన సాధారణ జీవితాలను గురించి ప్రధా నంగా రచనలు చేశారు. తండ్రి ఇటలీకి చెందిన యూదు జాతీయుడు కాగా, తల్లి లూయిసా కొల్పైన్ బెల్జియంలో పుట్టింది. ఆమె వెండితెర మీద హాస్య నటి. కానీ ఆమె జీవితమంతా విషాదమే. ఒక కొడుకు రూడీ కేన్సర్‌తో చనిపోయాడు. భర్త యూ దు కావడం వల్ల తరచూ అజ్ఞాతంలో గడిపేవాడు. మొడియానో రచనల నిండా ఈ దుఃఖమే ఘూర్ణి ల్లుతూ ఉంటుంది. చాలామంది రచయితల మాది రిగా నేను ఒక్క పుస్తకాన్నే చాలాసార్లు రాశాను అంటారాయన. ఆ ఇతివృత్తంతో అంతగా మమేక మయ్యారు మొడియానో. ఇదే వాస్తవాన్ని ‘ఆయన పుస్తకాలు పరస్పరం సంభాషించుకుంటాయి, ఒక దాని ప్రతిధ్వనిని ఒకటి వింటాయి’ అని నోబెల్ స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ చెప్పారు. తల్లి లూయిసా స్నేహితుడు, రచయిత, మొడియానో స్కూల్లో లెక్కల మాస్టారు రేమాండ్ క్యూనాతో ఏర్పడిన సాంగత్యమే మొడియానో దృష్టిని సాహిత్యం మీదకు మళ్లించింది. 1968 నుంచి మొదలుపెట్టి, మరో పనేదీ చేయకుండా ఇప్పటి దాకా దాదాపు 40 రచనలు చేశారు. ‘నైట్ రౌండ్స్’ ఆయన తొలి రచన. కొన్ని సినిమాలకు చిత్రానువాదం కూడా చేశారు. మొడియానో పేరు చెప్పగానే ఎవరైనా ‘మిస్సింగ్ పర్సన్’ నవలను గుర్తుకు తెచ్చుకుం టారు. దీనితో పాటు ‘ఔటాఫ్ ది డార్క్’, ‘దోరా బ్రూడర్’ కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చా యి. మిస్సింగ్ పర్సన్ నవలకు ప్రిక్స్ గాన్కోర్ట్ పుర స్కారం లభించింది. ఆయన రచనలలో ప్రధానంగా కనిపించే విస్మృతి, మూలాలను వెతుక్కుంటూ సాగడం అనే లక్షణాలు వీటిలోనూ కనిపిస్తాయి. మిస్సింగ్ పర్సన్ నవల ఇతివృత్తం, శైలి గొప్పగా అనిపిస్తాయి. గై రోలాండ్ అనే డిటెక్టివ్ కథను రచయిత ఇందులో వర్ణించారు. ఇతడు ఒక ప్రైవేటు సంస్థలో డిటెక్టివ్‌గా చేరడానికి ముందటి జీవితాన్ని మొత్తం మరచిపోతాడు. తను ఎవరో, తన జాతీ యత ఏమిటో కూడా మరచిపోతాడు. పదవీ విర మణ చేసిన తరువాత ఆ ప్రశ్నలకు జవాబులు అన్వే షిస్తూనే బయలుదేరతాడు. ఇతడు మరుపు వ్యాధికి గురైన సందర్భం మళ్లీ నాజీల దురాక్రమణ కాలమే. నిజానికి నాజీల దురాక్రమణ సమయంలో తామె వరమోనన్న సంగతిని మరుగుపరచడానికే ఎక్కువ మంది యూదులు ఇష్టపడ్డారు. నిజానికి పత్తేదార్లు ఆధారాల కోసం అన్వేషిస్తారు. కానీ గై రోలాండ్ జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళతాడు. పూర్వా శ్రమంలో తన పేరు మెక్వి అని, రష్యా నుంచి వలస వచ్చానని ఒకసారి, హాలీవుడ్ నటుడు జాన్ గిల్బర్ట్కు సన్నిహితుడనని ఒక పర్యాయం, లాటిన్ అమెరికాకు చెందిన దౌత్యవేత్తనని ఒకసారి భావి స్తాడు. చివరికి తాను గ్రీస్‌కు చెందినవాడిననీ, పేరు స్టెర్న్ అనీ కనిపెడతాడు. మొడియానో పరిశోధన సాగిస్తుండగా వార్తా పత్రికలో చూసిన ఒక ప్రకటన ఇచ్చిన ప్రేరణతో ‘దోరా బ్రూడర్’ నవల రాశారాయన. 1941లో దోరా బ్రూడర్ అనే యూదు బాలిక తప్పిపోయిం దని, ఆచూకీ చెప్పవలసిందని కోరుతూ నాటి పత్రికలో వెలువడిన ప్రకటన అది. చివరికి ఈమె, తండ్రితో కలిసి ఆష్విజ్ కేంప్లో ఉన్నట్టు తెలుస్తుం ది. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భాన్ని ప్రపంచం జరుపుకుంటున్న సందర్భంలో రెండవ ప్రపంచయుద్ధ బాధితుడికి ఈ పురస్కారం లభిం చడం ఎంతో సబబు. గోపరాజు నారాయణరావు