'ఒబామాకు నోబెల్ ఇవ్వడం ఓ పెద్ద తప్పిదం'
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడంపట్ల నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒబామాను మరింత ప్రోత్సహించేలా ఉంటుందని భావించాము. కమిటీ ఏమైతే ఆశించి ఒబామను 2009 నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసిందో..దాంట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.
ఒబామా కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం నమ్మలేక పోయాడని తెలిపారు. 2009లో నోబెల్ శాంతికి ఒబాను ఎంపిక చేయడం మీద జరిగినంత చర్చ.. మరే సంవత్సరానికి ఎంపిక అయిన వారి మీద జరగలేదన్నారు. చాలా మంది ఒబామా అనుచరులు కూడా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక తప్పిదంగానే భావిస్తున్నారని పేర్కొన్నారు. నోబుల్ శాంతి బహుమతికి అతను అర్హుడు కాదని యూఎస్ లోని చాలా మంది అభిప్రాయపడ్డారని తెలిపారు.