న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్‌జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment