బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచనలు
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment