ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,209 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 864 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం బలపడటం, మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 2.59 శాతం నుంచి 3.12 శాతానికి పుంజుకోవడంతో గ్లోబల్ స్థాయిలో 2.52 శాతం నుంచి 3.04 శాతానికి ఎగశాయి. గతేడాది 2.7 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment