![IRCTC spurts after turnaround Q1 numbers - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/13/IRCTC.jpg.webp?itok=bfmff2mW)
న్యూఢిల్లీ: రైల్వే రంగ దిగ్గజం ఐఆర్‌సీటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 82 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 24 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఆదాయం 85% పైగా జంప్‌చేసి రూ. 243 కోట్లను తాకింది. కాగా.. షేరు ముఖ విలువను విభజించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువగల ప్రతీ ఒక షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. తద్వారా మార్కెట్లో లిక్విడిటీ పెరగడంతోపాటు.. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,695 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,729 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం కావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment