
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment