
సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని పేర్కొంది. RINL ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదు. RINL పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రం వెల్లడించింది.