సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ సంజయ్ కుమార్ ఝా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మిధానిలోనే ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగపు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లోహశాస్త్ర ఇంజనీరింగ్‌లో బీఎస్సీ (1988) తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో చేరిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో చేరారు.
అణు ఇంధనాల తయారీ విషయంలో పలు సాంకేతిక సృజనలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు అవసరమైన కీలక విడి భాగాలను కూడా తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో అందించిన సేవలకు పలు అవార్డులు పొందారు. 2006లో కేంద్ర అణు శక్తి విభాగం సంజయ్ కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుతో సత్కరించింది. ఇదే విభాగం నుంచి ఐదుసార్లు గ్రూపు అవార్డులు కూడా పొందిన ఆయన 2016లో మిధానిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment