మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్ | MIDHANI to give away equipment to differently-abled | Sakshi
Sakshi News home page

మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్

Published Sat, Apr 2 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్

మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్

హైదరాబాద్: రక్షణ రంగానికి చెందిన మినీరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి టర్నోవర్(రూ.760కోట్లు) సాధించింది. 2016-15 ఆర్థిక సంవత్సరంలో తమ టర్నోవర్ రూ. 680 కోట్లని మిధాని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా 2014-15లో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల్లో అత్యధిక ఎంఓయూ స్కోర్(1.01-ఎక్స్‌లెంట్ రేటింగ్)ను సాధించామని మిధాని సీఎండీ డాక్టర్ దినేశ్ కుమారి లిఖి చెప్పారు. ఈ ఎక్స్‌లెంట్ రేటింగ్‌న సాధించడం ఇది వరుసగా 12వ ఏడాదని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల స్థూల లాభం ఆర్జించామని, రూ.1,100 కోట్ల ఆర్డర్లు సాధించామని తెలిపారు. ప్రభుత్వానికి వరుసగా 13 సంవత్సరాల పాటు డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement