Midhani Notification 2021: Apply Online 7 Jobs Vacancies - Sakshi
Sakshi News home page

మిధానీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

Published Tue, Nov 16 2021 3:29 PM | Last Updated on Tue, Nov 16 2021 3:38 PM

Midhani Recruitment 2021: Vacancies, Notification, Salary Details Here - Sakshi

హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–02, మేనేజర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–04, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–01.

సిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.09 నుంచి 31.60 లక్షల వరకు చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 40ఏళ్లు మించకూడదు. వేతనం ఏడాదికి రూ.13.50 నుంచి 40.70 లక్షల వరకు చెల్లిస్తారు.

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్‌ మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 45ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.18.0లక్షల నుంచి 49.70 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా వస్తే రాతపరీక్ష కూడా నిర్వహించవచ్చు. రాత పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021
► వెబ్‌సైట్‌: www.midhani-india.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement