executive posts
-
మిధానీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధానీ).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–02, మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–04, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–01. ► సిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.09 నుంచి 31.60 లక్షల వరకు చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 40ఏళ్లు మించకూడదు. వేతనం ఏడాదికి రూ.13.50 నుంచి 40.70 లక్షల వరకు చెల్లిస్తారు. ► డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 45ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.18.0లక్షల నుంచి 49.70 లక్షల వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా వస్తే రాతపరీక్ష కూడా నిర్వహించవచ్చు. రాత పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021 ► వెబ్సైట్: www.midhani-india.in -
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి 3 లక్షల జీతం
ఐఓసీఎల్, ఎన్టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థల అనుబంధ సంస్థ అయిన హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్(హెచ్యూఆర్ఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 513 ► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్. ► విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3 లక్షలు, అనుభవం ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.5.8 లక్షలు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: www.hurl.net.in ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్లో 29 ఎగ్జిక్యూటివ్ పోస్టులు భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 29 ► పోస్టుల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ► విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, సివిల్, ఎఫ్ అండ్ ఏ, కాంట్రాక్ట్–ప్రొక్యూర్మెంట్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి. ► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దర ఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021 ► వెబ్సైట్: www.recpdcl.in -
అవుతారా.. ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్!
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో మొత్తం 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనుంది. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడీబీఐ 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(సీఎస్ఈ) లేదా టెల్లర్ సర్వీస్ ఎగ్టిక్యూటివ్‌గా పనిచేస్తారు. అంతేకాకుండా బ్యాంక్ మేనేజర్‌కు అవసరమైన వృత్తిపరమైన సహాయ సహకారాలను కూడా అందించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మొదట ఏడాది కాలానికి గాను కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటారు. అనంతరం మంచి పనితీరు, ఖాళీలకు అనుగుణంగా మరో రెండేళ్ల వరకు ఈ ఒప్పందాన్ని పొడిగిస్తారు. మూడేళ్ల కాంట్రాక్టును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారు.. ఐడీబీఐ అంతర్గతంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–1) పోస్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. వేతనాలు ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఫిక్స్డ్ సాలరీస్‌ను అందిస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.29000 చెల్లిస్తారు. రెండో ఏడాది కాంట్రాక్టు పొడిగించినట్లయితే.. ప్రతి నెల రూ.31,000.. అలాగే మూడో ఏడాది కూడా సేవలను వినియోగించుకుంటే ప్రతి నెల రూ.34,000 వేలు వేతనంగా చెల్లిస్తారు. ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఏ రకమైన అలవెన్సులు లభించవు. అలాగే ఎటువంటి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు కూడా ఉండవు. అర్హతలు ► ఐడీబీఏ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ► వయసు: 01–07–2021నాటికి 20–25ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు–5ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–5ఏళ్లు, ఓబీసీ–3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ ఇలా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టుకు పిలుస్తారు. రాత పరీక్షతోపాటు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.. ఆన్లైన్ పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్æ 50 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు (0.25) మార్కు తగ్గిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ:ఆగస్టు18, 2021 nఆన్లైన్ పరీక్ష తేదీ:సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: www.idbibank.in -
గ్రూప్-2లోనూ రాత పరీక్షలు!
* ‘సిలబస్ కమిటీ’ సమావేశంలో ప్రతిపాదన * ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాలని యోచన * ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్-2లోనే కొనసాగింపు * గ్రూప్-1 ఎస్సే పేపర్లో తెలంగాణ అంశాలపై ప్రశ్నలు * 29న తుది నిర్ణయం.. 30న టీఎస్ పీఎస్సీకి నివేదిక సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షల తరహాలో గ్రూప్-2 పోస్టులకు కూడా రాత పరీక్షలు (డిస్క్రిప్టివ్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు గ్రూప్-2 కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే విధానాన్నీ అమలుచేయాలని భావిస్తోంది. అలాగే ఈ పోటీ పరీక్షల్లో ఎస్సే పేపర్లలో తెలంగాణకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో చేర్చాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పుల కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల విధానం (స్కీమ్), సిలబస్‌లో మార్పులపై విస్తృతంగా చర్చించారు. మార్పులు తప్పనిసరి.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే గ్రూప్-2 అధికారులు భవిష్యత్‌లో గ్రూప్-1 స్థాయికి వెళతారని, అందువల్ల గ్రూప్-2 పరీక్షా విధానంలో మార్పులు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేవలం ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ప్రశ్నలు ఇచ్చి ఎంపిక చేయడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రూప్-2లోనూ రాతపూర్వక పరీక్షల (డిస్క్రిప్టివ్) విధానం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని... ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి కచ్చితంగా ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనని సమావేశంలో స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆ సిఫారసులు వద్దు.. ఏపీపీఎస్సీలో సంస్కరణలపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీసీఎల్ఏ జె.సత్యనారాయణ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పట్లో ప్రభుత్వం గ్రూప్-2లో ఇంటర్వ్యూలను తొలగించింది. అందులోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా కేవలం ఆబ్జెక్టివ్ విధానంలోనే ఎంపిక చేయాలన్న సూచనను కూడా అప్పట్లో ప్రభుత్వం ఆమోదించింది. అంతేగాకుండా గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది. అయితే ఈ విధానాలు సరికావని తాజాగా టీఎస్ పీఎస్సీ సిలబస్ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బిగా కాకుండా గ్రూప్-2లోనే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే గ్రూప్-1లోని జనరల్ ఎస్సే (వ్యాసం) పేపర్లో తెలంగాణ సామాజిక రాజకీయాలు, భౌగోళిక చరిత్ర, ఆర్థిక అంశాలు, ఉద్యమ చరిత్రను సిలబస్‌గా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల్లోనూ తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రశ్నలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ఈ నెల 29న జరిగే స్కీమ్, సిలబస్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 30వ తేదీన ఈ నివేదికను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కమిటీ అందజేయనుంది. సర్వీస్ కమిషన్ ఈ అంశాలన్నింటిపై మరోమారు చర్చించి... పరీక్షల విధానాలు, సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతుంది. వాటిని ప్రభుత్వం పరిశీలించి.. ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మార్పులు అమల్లోకి వస్తాయి.