ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థల అనుబంధ సంస్థ అయిన హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్(హెచ్‌యూఆర్‌ఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 513
► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.
► విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3 లక్షలు, అనుభవం ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.5.8 లక్షలు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
► వెబ్‌సైట్: www.hurl.net.in
ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్‌లో 29 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 29
► పోస్టుల వివరాలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్.
► విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ మెటీరియల్ ఇన్‌స్పెక్షన్, సివిల్, ఎఫ్ అండ్ ఏ, కాంట్రాక్ట్–ప్రొక్యూర్‌మెంట్.
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి.
► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021
► వెబ్‌సైట్: www.recpdcl.in
Comments
Please login to add a commentAdd a comment