Malayalam Film Producer Jaison Joseph Dead Body Found In Kochi Apartment, Know Details - Sakshi
Sakshi News home page

Jaison Joseph Death: విగతజీవిగా ప్రముఖ సినీ నిర్మాత.. అసలేం  జరిగింది?

Published Tue, Dec 6 2022 2:37 PM | Last Updated on Tue, Dec 6 2022 3:28 PM

Malayalam film producer Jaison Joseph dead body Found at a flat in Kochi - Sakshi

మాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.​ ప్రముఖ నిర్మాత జైసన్​ జోసెఫ్ విగతజీవిగా మారాడు. కొచ్చిలోని​ తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్​ హీరోలు, నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలుపుతున్నారు. చిన్నవయసులోనే ఆయనను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక ప్రసిద్ధ మాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగానే కాకుండా.. జైసన్ జోసెఫ్ కేరళ నిర్మాతల సంఘంలో సభ్యుడితో పాటు  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యజమానిగా వ్యవహరిస్తున్నారు. కుంచాకో బోబన్ నటించిన 'జమ్నా ప్యారీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించారు.  కుంచాకో బోబన్, గాయత్రి సురేష్, నీరజ్ మాధవ్ ఈ సినిమాలో నటించారు.  గిరీష్ మనో దర్శకత్వంలో 2017లో విడుదలైన బిజు మీనన్ నటించిన ‘లవకుశ’ చిత్రాన్ని కూడా జైసన్ జోసెఫ్ నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement