ఇటీవలే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.
మాలీవుడ్ నటుడు వినాయకన్ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా నుంచి తొలగించాడు.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!)
లైవ్ వీడియోలో వినాయకన్ మాట్లాడుతూ.. 'అసలు ఊమెన్ చాందీ ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలని మీడియాను కోరారు. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు. అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు..' అని విమర్శలు చేశారు. దీంతో కేరళలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వినాయకన్ ఆ లైవ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. కాగా.. వినాయకన్ తదుపరి ఆసిఫ్ అలీ నటిస్తోన్న 'కాసర్ గోల్డ్' చిత్రంలో నటిస్తున్నారు.
(ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment