Oommen Chandy
-
మాజీ సీఎంపై ప్రముఖ కమెడియన్ వివాదాస్పద కామెంట్స్!
ఇటీవలే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం. మాలీవుడ్ నటుడు వినాయకన్ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా నుంచి తొలగించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!) లైవ్ వీడియోలో వినాయకన్ మాట్లాడుతూ.. 'అసలు ఊమెన్ చాందీ ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలని మీడియాను కోరారు. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు. అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు..' అని విమర్శలు చేశారు. దీంతో కేరళలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వినాయకన్ ఆ లైవ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. కాగా.. వినాయకన్ తదుపరి ఆసిఫ్ అలీ నటిస్తోన్న 'కాసర్ గోల్డ్' చిత్రంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Tk Vinayakan (@actorvinayakan) -
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత
-
సీబీఐకి మాజీ సీఎంపై లైంగిక దాడి కేసు
తిరువనంతపురం : కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతోపాటు పార్టీలోని ఇతర నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 2016, 2018, 2019లలో నమోదైన అయిదు కేసులను ప్రభుత్వం సీబీఐకు అప్పజెప్పనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కేరళలో గత యూడీఎఫ్ ప్రభుత్వంలో వెలుగు చూసినసోలార్ ప్యానెల్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా న్న సరితా నాయర్.. 2012లో వీరందరూ తనను లైంగికంగా వేధించారని గతంలో ఫిర్యాదు చేశారు. చాందీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీలు హిబి ఎడెన్, అదూర్ ప్రకాశ్, మాజీ మంత్రి ఏపీ అనిల్ కుమార్, ఏపీ అబ్దుల్‌కుట్టి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని సరితా ఆరోపించారు. అయితే అప్పటి కాంగ్రెస్ నేత జోస్ కే మణిపై కూడా ఆరోపణలు చేసినప్పటికీ అతను అనంతరం ఎల్డీఎఫ్లో చేరడంతో తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సోలార్ స్కాంపై దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషన్ 2017లో చాందీ, వేణుగోపాల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాందీ, ఇతరులు తనను లైంగికంగా వేధించారని, సోలార్ సంస్థ ద్వారా అక్రమంగా లాభార్జన పొందటానికి అనుమంతించారని నిందితురాలు కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. దీంతో వీరందరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అంతేగాక చాందీ హైకోర్టును ఆశ్రయించి అతనిపై ఉన్న కేసును రద్దు చేసుకున్నాడు. అలాగే లేఖలోని విషయాలను చర్చించకుండా మీడియాను నిరోధించుకున్నాడు. తర్వాత మహిళ కాంగ్రెస్ నాయకులపై కొత్తగా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు.. అంతేగాక ఈ కేసులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల ఆమె ముఖ్యమంత్రి పినరయి విజయన్ను సంప్రదించారు. కేసులను సీబీఐకు అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం లేదని ఆ మహిళ తెలిపింది. అయితే దీనిపై స్పందించిన చాందీ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కాగా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్యని కాంగ్రెస్ తప్పుపట్టింది.తమ పార్టీ నేతలపై ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైన ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడటంతో తమను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టింది. మరోవైపు మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఎల్డీఎఫ్ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ ఆరోపించారు. -
కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్!
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీకి కేరళలలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు రాజీనామా చేశారు. దీంతో కేరళలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎంపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్ బెన్నీ బెహానన్, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు లేకుండానే పార్టీకి రాజీనామా చేశారు. ఇక బెహానన్ పార్టీ నుంచి తప్పుకున్న కొద్ది సేపటికే మరొక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. కరుణాకరన్ కుమారుడు కె. మురళీధరన్ కూడా కేపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు . 2018 సెప్టెంబర్‌లో కేపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన, 2019 సార్వత్రిక ఎన్నికలలో వటకర నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ విషయంపై బెహానన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు లేకుండా రాజీనామా చేశానని చెప్పారు. పార్టీకి మంచి సేవలందించాలంటే నాయకులు ఒకటి కంటే ఎక్కువ పదవులలో ఉండకూడదని కేపీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ సూచించిన తరువాత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలోని ఒక విభాగం పార్లమెంటు సభ్యుడిగా ఉండటంతో పాటు బెహానన్ పార్టీ కన్వీనర్‌గా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో బెహానన్ భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారని ఆ నివేదికలలో పేర్కొన్నారు. 2018 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు కన్వీనర్‌గా బెన్నీ బెహానన్ నియమితులయ్యారు. రాజీనామా తరువాత, మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, ఊమెన్ చాందీ విధేయుడు ఎంఎం హసన్ ఈ పదవి చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: ‘ఆ ఎంపీని తొలగించండి’ -
ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం
-
‘ఏ పార్టీతో పొత్తు కాదు.. ప్రజలతోనే మా పొత్తు’
సాక్షి, అమరావతి : రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కాదు.. ప్రజలతోనే మా పొత్తు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ తెలిపారు. యూపీఏ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏపీలో 74 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించామన్నారు. పార్టీ బలోపేతానికి చెపట్టవలసిన చర్యలపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ విభజన సమయంలో చెప్పింది.. దానికే కట్టుబడి ఉన్నామని ఉమెన్ చాందీ చెప్పారు. అధికారంలో లేనప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావలని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మాట మార్చారని ఆయన విమర్శించారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో ఉన్న టీడీపీ హోదా సాధించలేకపోయిందని కాంగ్రెస్ నేత ధ్వజమెత్తారు. జిల్లాలో జ్యూట్ మిల్లులు మూతపడితే 25 వేలలకుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదుని మండిపడ్డారు. ‘ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు చట్టంలో ఇవ్వాలని చెప్పాం. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. రూ 24,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.1,050కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. జిల్లాకు ఇస్తామన్నాఅనేక ప్రాజెక్టులకు అతిగతి లేదు. కాంగ్రెస్ హయాంలో ప్రారంబించిన అనేక సాగు నీటి ప్రాజెక్టులను కనీసం పూర్తి చేయలేని పరిస్తితి జిల్లాలో ఉంది. అక్టోబర్ 2 నుంచి ఇంటింటి కాంగ్రేస్ నిర్వహిస్తాం’ అని కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీ తెలిపారు. -
‘అక్కడ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ’
సాక్షి, విజయవాడ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడి అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాననీ.. పార్టీ బలోపేతానికి మూడు నెలల్లో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. దేశాన్ని వెలిగిపోయేలా చేస్తామని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ నాలుగేళ్లుగా వెలగబెట్టిందేం లేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. పెరిగిన ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యుడి జేబుకు చిల్లులు కాదు.. బొక్కలు పడుతున్నాయనీ, దానికితోడు పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు తన నాలుగేళ్ల అసమర్థ పాలన నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారని ఆరోపించారు. -
ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఊమెన్ చాందీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా కేరళ మాజీ ముఖ్య మంత్రి ఊమెన్ చాందీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగ్విజయ్ ఔట్.. ఏపీ ఇన్చార్జ్గా ఊమెన్ చాందీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఏపీ పీసీసీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీగా ఊమెన్ చాందీని వెంటనే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న దిగ్విజయ్‌సింగ్ ప్రశంసనీయమైన సేవలు అందించారని, ఆయన వెంటనే ఆ పదవి నుంచి దిగిపోతారని తెలిపింది. -
ఓ మాజీ సీఎం.. అనూహ్య రైలు ప్రయాణం!
ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్ క్లాస్ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి.. తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. డాబూ, దర్పాలకు పోకుండా సామాన్యులతో మమేకమై.. సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయణంపై ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ. మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుడు గత సోమవారం స్లీపర్ క్లాస్ కపార్ట్‌మెంట్‌లో 160 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన నిరాడంబర ప్రయాణం ఫొటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని, వీఐపీ లాంజ్‌లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కొందరు ఎంపీలు కొన్ని వారాల కిందట కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు. తన ప్రయాణంపై మాజీ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ ‘పెద్దగా రద్దీ లేని స్లీపర్ క్లాస్ రైళ్లలో ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్లోనే వెళుతాను. దీనివల్ల ప్రజలతో మమేకమవ్వొచ్చు. లేకపోతే ఒంటరితనంగా తోస్తుంది. వీఐపీ అన్న భావనపై నాకు నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు. గత మే నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఊమెన్ చాందీ సీఎం పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో సాధారణ ప్రయాణికుడిలా బస్సు ప్రయాణం చేశారు. -
టీ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్‌గా మాజీ సీఎం!
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ బలహీనపడటం అ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్ చాందీని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు హింట్ ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ్ స్కీమ్ తో కాంగ్రెస్ బలహీనపరుస్తున్న నేపథ్యంలో ఊమెన్ చాందీకి పగ్గాలు అప్పగించనున్నారు. కాగా చాందీ కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. -
27లోపు హాజరుకాకుంటే అరెస్టు చేస్తాం!
- సరితా నాయర్ కు విచారణ కమిషన్ హెచ్చరిక కొచ్చి: కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కు వ్యతిరేకంగా దర్యాప్తు కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఎన్నిసార్లు పిలిచినా తమ ముందు విచారణకు హాజరుకాకపోవడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ఆమె కమిషన్ ముందు హాజరుకావాలని, లేకపోతే ఆమెను అరెస్టు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ తేల్చిచెప్పింది. సరితా నాయర్ గతంలో నాలుగుసార్లు కమిషన్ ముందు విచారణకు హాజరుకాలేదు. కమిషన్ ముందుకు రాకపోవడానికి ఆమె గుర్తుతెలియని కారణాలను చెప్తున్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తామని అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసి.. ఆ తర్వాత మోసం చేసిన కేసులో 2013లో సరితా నాయర్‌ను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ కుంభకోణంలో భాగంగా తాను అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ, ఆయన కేబినెట్ మంత్రి అరయాదన్ మహమ్మద్ కు రూ. 1.9 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ శివరాజన్ కమిషన్ ఏర్పాటైంది. కాగా, తనపై ఆరోపణలు చేసినందుకుగాను సరితా నాయర్ పై మాజీ సీఎం చాందీ పరువు నష్టం దావా వేశారు. -
చరిత్ర సృష్టించిన సీఎం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది చరిత్ర సృష్టించారు. కేరళలో అత్యధిక రోజులు సీఎంగా కొనసాగిన ఘనత సాధించారు. సీఎంగా ఆయన బుధవారం నాటికి 1,827 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగిన రికార్డు సొంతం చేసుకున్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన కంటే ముందు సీఎంగా పనిచేసిన వీఎస్ అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు. అచ్యుతానందన్ 1,822 రోజులు సీఎంగా పనిచేశారు. తాజాగా కేరళ అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరిగాయి. అయితే మరో పర్యాయం చాందికి అవకాశం దక్కకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముందస్తు సర్వేలు అంచనాలు తప్పుతాయని, మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చాంది విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం నిలబెట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు. -
కేరళ పీఠం ఎవరిదంటే..??
సోమవారం జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్)కు 88 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశముందని, ఆ పార్టీ క్లియర్ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 38 నుంచి 48 సీట్లు రావొచ్చునని పేర్కొంది. బీజేపీతోపాటు ఇతరులకు కలిపి సున్నా నుంచి మూడు సీట్ల వరకు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే. -
ఎవరు తీసుకొచ్చారు? ఎలా వచ్చారు?
తిరువనంతపురం: కల్లోలిత లిబియాలో చిక్కుకొని కొన్ని రోజులపాటు నరకం అనుభవించిన ఆరు కుటుంబాలకు చెందిన 29 భారతీయులు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. వీరు ఇలా కేరళ చేరుకొని తమ ఆప్తులతో సంతోషంలో మునిగిపోయారో లేదో.. వీరి తరలింపుపై అప్పుడే రాజకీయ వివాదం మొదలైంది. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిబియా నుంచి కేరళకు చేరిన ఈ 29మందిని మేమంటే మేము భారత్ తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయి. లిబియా నుంచి భారతీయుల తరలింపు తమ ప్రభుత్వం ఘనతేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీలో ఘనంగా ప్రకటించగా.. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాత్రం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఖర్చులు భరిస్తే వారు కేరళకు తిరిగొచ్చారంటూ చాందీ చెప్తున్నారు. ఇక, చాందీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. 'గతంలో ఇరాక్, లిబియా, యెమన్ నుంచి కేరళ వాసులను భారత్‌కు తరలించేందుకు ఖర్చులు ఎవరు భరించారో చెప్పండి చాందీగారు' అంటూ ఆమె ట్విట్టర్లో నిలదీశారు. దీంతో ఇరకాటంలో పడిన చాందీ మరో వివరణ ఇచ్చారు. 'గతంలో కేరళ వాసుల తరలింపు కోసం సుష్మాస్వరాజే డబ్బులు చెల్లించారు. కానీ ఈసారి మాత్రం వారి తరలింపు కోసం మేం ఖర్చులు భరించాం' అని ఆయన చెప్పారు. కావాలంటే తాజాగా లిబియా నుంచి వచ్చిన వారినే అడగండి.. నిజం తెలుస్తుందని చాందీ అన్నారు. అదే సమయంలో కేరళను సోమాలియాతో పోల్చడంపై ప్రధాని మోదీపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. మొత్తానికి లిబియా నుంచి భారతీయుల తరలింపు అంశం చుట్టే ఇప్పుడు కేరళలో రాజకీయాలు తిరుగుతున్నాయి. -
ప్రీపోల్ సర్వే: కేరళలో గెలుపెవరిదంటే..
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని సంకేతాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ప్రీపోల్స్ సర్వే ఒకటి స్పష్టం చేసింది. తిరువనంతపురానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఎకనామిక్ గ్రోత్ (ఐఎంఈజీ) సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఎల్డీఎఫ్కు 83 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 50 నుంచి 57 సీట్లు రావొచ్చునని వెల్లడైంది. ఎప్పటిలాగే బీజేపీ కేరళలో మరోసారి ఖాతా తెరిచే అవకాశం లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే. కేరళలోని దక్షిణ, ఉత్తర, సెంట్రల్ ప్రాంతాల్లో 60వేలమంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. ఎజావా నేతృత్వంలోని బీజేడీఎస్ బీజేపీకి మద్దతు పలికినప్పటికీ, ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా స్పల్పంగా ఉన్నాయని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ కి రెబల్ పోరు బాగా ఎక్కువగా ఉంటుందని, రెబల్ అభ్యర్థుల వల్ల ఆ పార్టీ ఏడు స్థానాలు కోల్పోయే అవకాశముందని సర్వే విశ్లేషించింది. సోలార్ కుంభకోణంలో సీఎం ఊమెన్ చాందీ ప్రమేయముందని 63శాతం మంది కేరళ వాసులు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఇక, 51శాతం మంది వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తోందని అభిప్రాయపడ్డారు. -
ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం
కొచ్చిన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన పై ప్రతిపక్షనేత దుష్ప్రాచారం చేస్తున్నారని ఉమెన్ చాందీ మండిపడ్డారు. కోర్టులో ఉమెన్ చాందీపై 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అచ్యుతానందన్ ఆరోపించారు. అయితే దీని పై చాందీ స్పందిస్తూ..'కోర్టులో నాపై ఉన్న కేసుల వివరాలు బహిర్గతం చేయాలి. నాపై ఒక్క కేసు కూడా పెండింగ్‌లో లేదు. దీనిపై అచ్యుతానందన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణచేప్పాలి' అన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో, పోలీసు స్టేషన్‌లోగానీ ఫిర్యాదు నమోదు చేసినంత మాత్రాన దాన్ని కేసుగా పరిగణించలేమన్నారు. కేసు ఎఫ్ఐఆర్ తో ప్రారంభమౌతుంది. తనపై నమోదైన ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని అచ్యుతానందన్‌కు సవాలు విసిరారు. తన మంత్రివర్గసభ్యులపైన కూడా 131 కేసులు నమోదయ్యాయన్న వ్యాఖ్యల్లో వాస్తవంలేదన్నారు. కేవలం ఆర్థికమంత్రి కేఎం మణి పై ఒక్క కేసు మాత్రమే నమోదైందన్నారు. దీనిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసి కేసుకు సంబందించి పూర్తి వివరాలను కోర్టు సమర్పించిందని తెలిపారు. -
సీఎం పై 26 ఏళ్ల యువకుడి పోటీ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి కొట్టాయం జిల్లా పుట్టుపల్లి నియోజకవర్గం పై పడింది. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీపై 26 ఏళ్ల యువకుడు పోటీ చేయనున్నాడు. పోటీ చేసిన 10 సార్లు పుట్టుపల్లి నియోజక వర్గం నుంచి గెలుపొంది 11వ సారి చాందీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. భారత దేశంలోనే యునైటెడ్ నేషన్స్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అందుకున్న ఏకైక సీఎం చాందీ. అయినా ముఖ్యమంత్రి, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలతో ఈ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. తనకు పుట్టుపల్లి నియోజకవర్గ ప్రజలకు అవినాభావసంబంధం ఉందని, నిరాధారమైన ఆరోపణలను వారు నమ్మరని చాందీ తెలిపారు. మరోవైపు 26 ఏళ్ల జేక్ సీ థామస్‌ను ,73 ఏళ్ల చాందీపై పుట్టుపల్లి నియోకవర్గం నుంచి సీపీఎం పోటీకి దింపింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యువజన విభాగం నాయకుడిగా ఉన్న థామస్ విద్యార్థి నాయకుడిగా 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. తొలిసారి ఏకంగా సీఎం పై పోటీకి దిగే అవకాశాన్ని సీపీఎం కల్పించింది. 'చాందీ పై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు ఏ సీఎం పైనా రావడం ఇక్కడి ప్రజలు చూడలేదు. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. పుట్టుపల్లిలో అభివృద్ది పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయం అని' థామస్ పేర్కొన్నారు. -
సరితకు సీఎం లీగల్ నోటీసులు
తిరువనంతపురం: తనపై ఆరోపణలు చేసిన సరితా నాయర్ కు లీగల్ నోటీసులు పంపినట్టు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. సరిత మూడేళ్ల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటకు రావడం పట్ల కుట్ర దాగుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆమెపై చట్టపరంగా చర్య తీసుకుంటామన్నారు. దీని వెనుక బలమైన లాబీ ఉందని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సోలార్ స్కామ్ వెలుగుచూసి మూడేళ్లు గడిచినా ఇప్పుడే కొత్తగా వెల్లడైనట్టు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్యనిషేధం అమలుతో అవస్థలు పడుతున్నవారే తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, సీఎం చాందీ తనను లైంగికంగా వేధించారని సరితా నాయర్ 2013లో రాసిన లేఖను ఓ టీవీ చానల్ ఆదివారం బయటపెట్టడంతో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాశానని సరిత అంగీకరించారు. దీనిపై విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు. -
'సీఎం నన్ను లైంగికంగా వేధించారు'
తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సరితా నాయర్ కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై తీవ్రమైన ఆరోపణలతో ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. తనను ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ ప్రతిని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి. ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు. ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు. 'ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసివన్నీ వాస్తవాలే' అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని చాందీ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని దించడానికి చివరి ప్రయత్నంగా దీన్ని వర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. సోలార్ కుంభకోణంలో సహ నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలోనూ చాందీపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. -
కేరళ సీఎంకు తప్పిన ముప్పు
కొట్టాయం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ముప్పు తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై జారిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది.కొట్టాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బయటపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సీఎం గన్ మేన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు. తాను సీటు బెల్టు పెట్టుకోవడంతో తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఊమెన్ చాందీ తెలిపారు. ఎత్తుమనూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. -
కేరళ సీఎంతో ఎంపీ కవిత భేటీ
తిరువనంతపురం: పసుపునకు కనీస మద్దతు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కోరారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని, పసుపు మద్దతు ధరను కేంద్రం నిర్ణయించేలా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. తిరువనంతపురంలోని సీఎం కార్యాలయంలో ఊమెన్ చాందీని కవితతో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, విద్యాసాగర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కలసి ఓ లేఖ అందజేశారు. 'పసుపు రైతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వలన కష్టాలు పడుతున్నారు. మద్దతు ధర లేకపోవడం వల్ల దళారీలు లాభపడుతున్నారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. పసుపును ప్రధానంగా ఆహారంలో, మందుల్లో, సౌందర్య సాధనాల్లో, హెయిర్ డై, వస్త్ర పరిశ్రమల్లో వాడుతున్నారు. విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతున్న ఈ పంటకు మన దేశంలో కనీస మద్దతు ధర లేదు. పసుపు ప్రస్తుతం స్పైస్ బోర్డులో భాగంగా ఉంది. ఇది పసుపుతో పాటు దాదాపు ఇతర 54 పంటలను పర్యవేక్షిస్తోంది. అలా కాకుండా ఇప్పటికే ఉన్న పొగాకు, కాఫీ బోర్డుల వలే ఒక ప్రత్యేక బోర్డు పసుపు పంటకు ఉండడం అవసరం' అని లేఖలో పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం పసుపు రైతులకు హెక్టారుకు 12,500 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడంతో ఎర్నాకులం, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కొల్లాం జిల్లాల పసుపు రైతులకు మేలు జరిగిందని కవిత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. బోర్డు ఏర్పాటు వల్ల కేరళకు చెందిన అల్లెప్పీ రకం పసుపు ఎగుమతులు పెరుగుతాయని కవిత చెప్పారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ.. పసుపు పంటకు మద్దతు ధరను సాధించడం కోసం కేంద్రం పై సమష్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కవిత గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను కలసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా సమావేశమయ్యారు. -
'అదంతా లెఫ్ట్-లిక్కర్ లాబీ కుట్ర'
తిరువనంతపురం: సోలార్ స్కామ్.. వామపక్ష కూటమి, లిక్కర్ లాబీ కుట్ర అని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి యూడీఎఫ్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తనను పదవి నుంచి దించేందుకు లిక్కర్ లాబీ ప్రయత్నిస్తోందని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాందీ ఆరోపించారు. బెదిరింపులకు భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. సోలార్ స్కామ్ లో లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తనను ఎవరూ ఒత్తిడి చేయాలని లేదని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పారు. సోలార్ స్కామ్ లో తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యమని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పాలనలో రాష్ట్రం పతనమైందని లెఫ్ట్ చేసిన ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. గత ఐదేళ్లలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని ఊమెన్ చాందీ దీమా వ్యక్తం చేశారు. -
‘సౌర’ తుఫానులో చాందీ
కేరళకు ఎన్నికలూ, కుంభకోణాలూ జంటకవుల్లా వస్తుంటాయి. దాదాపు రెండున్న రేళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశమై న్యాయవిచారణ కొనసాగుతున్న సోలార్ కుంభకోణం... మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దశలో యూడీఎఫ్ సర్కారుకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మెడకు చుట్టుకుంది. ఈ స్కాంలో ఊమెన్ చాందీపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని విశ్వసించిన విజిలెన్స్ కోర్టు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఆదేశించింది. తాను సీఎంకు రూ. 1.90 కోట్ల ముడుపులిచ్చానని ఈ స్కాంలో ప్రధాన నిందితురాలైన సరితా ఎస్. నాయర్ న్యాయ విచారణ కమిషన్ ముందు చెప్పిన మర్నాడే విజిలెన్స్ కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే 24 గంటలు గడవకుండానే శుక్రవారం ఊమెన్ చాందీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ స్టే ఉత్తర్వులు రెండు నెలలపాటు అమల్లో ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి చెప్పాక ‘న్యాయమే గెలిచింద’ని చాందీ ప్రకటించినా ఈ కేసును వదుల్చుకోవడం ఆయనకంత సులభం కాదు. కేవలం సాంకేతిక కారణాలతో మాత్రమే ఈ స్టే ఉత్తర్వులొచ్చాయి తప్ప స్కాంలో నిజానిజాలేమిటో హైకోర్టు నిర్ధారించలేదు. రెండు నెలల తర్వాత ఆయన అప్పీల్ విచారణకొచ్చినప్పుడు కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని భావిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉంటాయి గనుక చాందీకి సమస్యలు ఎదురుకావొచ్చు. నిజానికి చాందీ ఇప్పటికే ఇందులో పీకల్లోతు మునిగిపోయారు. చాందీ ప్రమేయంలోని నిజానిజాల సంగతలా ఉంచి నైతిక కారణాలతోనైనా ఆయన్ను రాజీనామా చేయించకపోతే ఎలా అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది. బహుశా హైకోర్టు స్టే ఉత్తర్వులు రాకపోతే చాందీని ఈపాటికే ఇంటికి పంపవలసివచ్చే దేమో! బార్ యజమానుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణపై విజిలెన్స్ కోర్టు గత వారం మంత్రి కె. బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తే వారం గడిచాక హైకోర్టు ఆ ఉత్తర్వులపై ఇదే మాదిరి స్టే ఇచ్చింది. కానీ ఈలోగా ఆయన రాజీనామా చేయకతప్పలేదు. బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం లాంటి లక్ష కోట్ల నిడివి దాటిన స్కాంల గురించి కథలు కథలుగా విన్న జనానికి రూ. 7 కోట్లు మించని ఈ సోలార్ స్కాం చిల్లర కుంభకోణంగా కనిపించవచ్చు. అయితే ఎన్నికలు ఆగమిస్తున్న వేళ కుంభకోణం చిన్నదా, పెద్దదా అన్న అంశానికి ప్రాధాన్యత ఉండదు. పైగా ఇందులో డబ్బుతోపాటు మహిళలను ఎరవేయడమనే అంశం కూడా చేరడంతో దీనికి భారీ ప్రచారం లభిస్తోంది. దానికితోడు ఈ స్కాంకి సంబంధించి ఆడియో, వీడియో టేపులు ఉన్నాయని గుప్పుమనడంతో అందరి దృష్టీ ఈ కేసుపైనే పడింది. దీని పూర్వాపరాలు ఆసక్తి కలిగించేవే. టీం సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ పేరిట తన జీవన సహచరుడు బిజూ రాధాకృష్ణన్‌తో కలిసి సరితా నాయర్ ఒక కంపెనీ స్థాపించారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేస్తామని పలుకుబడి గల వ్యక్తులనుంచి రూ. 7 కోట్లు సేకరించారు. అందుకు సీఎం ఊమెన్ చాందీ పేరు వాడుకున్నారు. సోలార్ యూనిట్లు అందజేస్తామని ఆశపెట్టి జనంనుంచి ముందస్తుగా డబ్బు కట్టించుకున్నారు. పనిలో పనిగా ఇద్దరు మహిళలను వినియో గించుకుని పలువురు అధికారులకూ, వారి ద్వారా మంత్రులకూ, సీఎం కార్యాల యంలోనివారికీ సన్నిహితమయ్యారు. చివరకు ఊమెన్ చాందీని సైతం ఇందులో దించగలిగారు. నేరుగా ఆయనను కలిసి తమ ప్రాజెక్టుకు అవసరమైన మద్దతు పొందగలిగారు. ఈలోగా తనకు అందజేస్తానన్న సోలార్ యూనిట్ ఇవ్వకుండా కంపెనీ మొహం చాటేస్తున్నదంటూ ఒక వినియోగదారుడు కేసు పెట్టడంతో ఈ వ్యవహారమంతా భళ్లున బద్దలయింది. తమ చుట్టూ తిరుగుతున్న సరితా నాయర్, ఆమె ప్రతినిధులు ఉత్త వంచకులని అందరికీ అర్ధమయ్యేసరికి మీడియాలో ఈ స్కాం మార్మోగింది. వెనువెంటనే ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. చివరకు న్యాయ విచారణకు ఆదేశించక తప్పలేదు. ఈ స్కాంతో తనకు సంబంధమే లేదని చాందీ చెబుతున్నారు. మద్య నిషేధం విధించాక బార్ యజమానులు తనపై కక్షగట్టి ఇందులో ఇరికించడానికి చూస్తున్నా రని ఆయన అంటున్నారు. ఈ స్కాంలోని ప్రధాన నిందితురాలు సరితా నాయర్ విచారణ కమిషన్‌కు వెల్లడిస్తున్న విషయాలు పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఆమె ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యమంత్రికి ముడుపులిచ్చానన్న నోటితోనే విపక్షంగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ నేతలనూ ఇరకాటంలో పడేశారు. చాందీపై నేరుగా ఆరోపణలు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే రూ. 10 కోట్లు ఇస్తామని 2014లో సీపీఎం నేతలు ఆశజూపారని కూడా అన్నారు. తన సోలార్ ఎనర్జీ కంపెనీకి సబ్సిడీలు, ఇతర లాభాలూ పొందవచ్చునన్న ఉద్దేశంతో చాందీకి రూ. 1.90 కోట్లు, విద్యుత్ మంత్రిగా ఉన్న మహమ్మద్‌కు రూ. 40 లక్షలు ఇచ్చానని ఆమె చెప్పారు. అంతేకాదు... చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌ను కూడా ఆమె ఈ స్కాంలోకి లాగారు. ఒక మహిళతో కలిసి అతను పశ్చిమాసియాకు యాత్రలు చేశాడని వెల్లడించారు. తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అత్యాచారానికి పాల్ప డ్డారని ఆరోపించారు. సరితా నాయర్‌తో సీఎంఓలోని ముఖ్య అధికారులతోపాటు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఇద్దరు, కేరళకు చెందిన యూడీఎఫ్ నాయకులు... మొత్తంగా 30మంది తరచు మాట్లాడేవారని ఆమె కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆమె జీవన సహచరుడు బిజూ రాధాకృష్ణన్ గత నెలలో ఇదే కమిషన్ ముందు... సీఎంకు తాను రూ. 5.5 కోట్లు ఇచ్చానని వెల్లడించారు. భార్యను హత్య చేసిన కేసులో ఆయన ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ కాంగ్రెస్‌కూ, పాలక యూడీఎఫ్‌కూ కష్టకాలమే. దీన్ని ఊమెన్ చాందీ ఎలా అధిగమించగలరో చూడాల్సి ఉంది. -
'సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి'
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోలార్ కుంభకోణంలో ఏకంగా ఊమెన్ చాందీపైనే ఆరోపణలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ఇలా కొనసాగుతుండగానే.. సోలార్ స్కాంలో స్థానిక విజిలెన్స్ కోర్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఆదేశించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తిరువనంతపురంలో వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమెన్ చాందీకి సోలార్ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, బిజు రాధాకృష్ణణ్తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చౌక ధరలకు సౌరవిద్యుత్ అందిస్తామంటూ వారు పారిశ్రామికవేత్తలను మోసగించారు. తమ రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకొని బడాబడా కాంట్రాక్టులను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఎం వ్యక్తిగత సిబ్బందికి తాము రూ. 2 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ప్రకటించడం కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. -
'ఆ డబ్బు వెనక్కు తీసుకోం'
తిరువనంతపురం: అగ్రనటుడు మోహన్ లాల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానన్న డబ్బు తీసుకోబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. 35వ జాతీయ క్రీడలు ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్ లాల్ నేతృత్వంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు నిరాశపరిచాయి. దీంతో ప్రభుత్వం నుంచి తీసుకున్న పారితోషికం(రూ.1.63 కోట్లు) వెనక్కు తిరిగిచ్చేస్తానని మోహన్ లాల్ ప్రకటించారు. అయితే ఈ డబ్బు తీసుకోబోమని సీఎం చాందీ అన్నారు. నైతికంగా ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. మోహన్ లాల్ ఈ డబ్బు సొంతానికి తీసుకోలేదన్నారు. వేదిక ఖర్చులు, కళాకారుల కోసం ఆయన ఈ మొత్తం తీసుకున్నారని చెప్పారు. ఏదేమైనా వేడుకలపై వివాదం రేగడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. -
కేరళలో 11 మంది మతమార్పిడి
తిరువనంతపురం: కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు. అలప్పుజా జిల్లా కాయంకుళం దగ్గర్లోని కేశవూర్ ఆలయంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బుధవారం వీహెచ్‌పీ చొరవతో హిందూమతం స్వీకరించారు. ఇదే జిల్లాలో ఈ నెల 21న 30 మంది ఎస్సీ క్రైస్తవులు హిందూ మతం పుచ్చుకోవడం తెలిసిందే. కాగా, కేరళలో బలవంతపు మతమార్పిళ్లు జరగడంలేదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. మరోవైపు జనవరి 4న రాజస్థాన్‌లోని ఝుంఝునులో క్రైస్తవ కుటుంబాలను హిందూ మతంలోకి మారుస్తామని వీహెచ్‌పీ ప్రకటించింది. -
విజన్-2020 ప్రారంభించిన మమ్ముట్టి
తిరువనంతపురం: కంటి సంబంధిత కాటరాక్ట్ వ్యాధి లేని కేరళ రాష్ట్రం చూడాలని మలయాళ నటుడు మమ్మూట్టి కలలుకంటున్నారు. అందుకోసం మమ్మూట్టి తన జన్మదినం రోజున విజన్ 2020 ప్రారంభించారు. కోచీలో మమ్ముట్టి 63వ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన విజన్ 2020 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పాల్గొన్నారు. కంటి సంబంధి వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చాందీ హామీ ఇచ్చారు. మమ్మూట్టి ప్రారంభించి కార్యక్రమానికి నిధులు అందిస్తామని ఆయన చెప్పారు. మమ్ముట్టి జన్మదినం రోజునే తిరు ఓనమ్ కావడం విశేషం. అంతేకాకుండా మమ్ముట్టి నటించిన మున్నారియిప్పు, రాజాధి రాజా చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. -
కేరళలో సంపూర్ణ మద్య నిషేధం
బార్ల మూసివేత... ఆదివారాల్లో మద్యం అమ్మకాలు బంద్ తిరువనంతపురం: కేరళలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నేతృత్వంలో జరిగిన యూనెటైడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ యూడీఎఫ్ భేటీ అనంతరం ఉమెన్ చాందీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయని, పదేళ్లలో మొత్తం రాష్ట్రంలో మద్యం నిషేదిస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూతపడిన 418 బార్లు మళ్లీ తెరుచుకునే అవకాశం లేదని,అన్నారు. ఆదివారాల్లో మద్యం అమ్మకాలు జరపకూడదని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏటా పది శాతం మద్యం దుకాణాలు మూసివేస్తామని, ఇలా పదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బెవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణాల్లో పనిచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపుతామని తెలిపారు. ఈ అంశం కేరళ కేబినెట్ ముందుకు వెళుతుందని, ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుందని యూడీఎఫ్ కన్వీనర్ పీపీ టంకచ్చన్ తెలిపారు. -
వివాదస్పద వ్యాఖ్యలకు సురేశ్ గోపి క్షమాపణ!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి క్షమాపణలు తెలిపారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బందికి గురిచేసి ఉంటే, అందుకు నా క్షమాపణలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యమంత్రిని విమర్శించడం తన వ్యాఖ్యల ఉద్దేశం కాదు. ఏ ప్రాజెక్ట్ కైనా అనుమతి తెలిపే ముందు సంప్రదింపులు జరుపాల్సి ఉండాల్సింది అని యూఎస్ నుంచి ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో సురేశ్ గోపి అన్నారు. గత వారం ఓ బహిరంగ సభలో సురేశ్ గోపి మాట్లాడుతూ.. ప్రతిపాదిత అరన్ములా ఎయిర్ పోర్టు పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారని, ఉమెన్ చాందీకి కొన్ని విషయాల అవగాహన లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా కేరళలో దుమారం రేగుతోంది. మంత్రులు డయస్పోరా, కేసీ జోసఫ్, రాధకృష్ణన్ లు సురేష్ గోపిపై విమర్శల్ని ఎక్కుపెట్టారు. అంతేకాకుండా సురేశ్ గోపి ఇంటిని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించి.. దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. -
క్షేమంగా.. సొంత ఊరికి!
ఇరాక్ నుంచి కేరళ చేరిన భారతీయ నర్సులు కొచ్చి విమానాశ్రయంలో స్వాగతం పలికిన కేరళ సీఎం అదే విమానంలో భారత్ వచ్చిన 78 మంది తెలంగాణ, ఆంధ్ర కార్మికులు కొచ్చి/హైదరాబాద్: ఇరాక్‌లో దాదాపు గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మృత్యుభయంతో గడిపిన 46 మంది భారతీయ నర్సులు శనివారం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం, ఇరాక్‌లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో కొచ్చి చేరుకున్నారు. వారికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వాగతం పలికారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయలుదేరిన ఆ విమానంలో ఆ నర్సులు సహా మొత్తం 183 మంది స్వదేశం చేరుకున్నారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 78 మంది కార్మికులు కూడా ఉన్నారు. అనంతరం వీరిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపించారు. అక్కడినుంచి వారిని వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్లని భారతీయ ఎంబసీ అధికారులకు చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు. తమకు బాకీ ఉన్న నాలుగునెలల జీతాలు ఇచ్చేవరకు విమానం ఎక్కబోమంటూ మొదట్లో నర్సులు ఎర్బిల్ విమానాశ్రయంలో పట్టుబట్టారని, అయితే, దౌత్యాధికారులు నచ్చజెప్పడంతో విమానం ఎక్కారని సమాచారం. దాదాపు నెల్లాళ్ల క్రితం ఇరాక్‌లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్‌కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే రెండు రోజుల్లో మరో 600 మంది భారతీయులు ఇరాక్‌నుంచి స్వదేశానికి రానున్నారు. అమ్మో.. మళ్లీ వెళ్లం! ‘బాంబు పేలుళ్ల శబ్దాలు ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ.. నిద్రలేని రాత్రులు గడిపాము. మరోసారి మా ప్రాణాలను పణంగా పెట్టబోం. ఇరాక్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు’ అని భారత్ తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేస్తున్నారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందని కవలలైన సోనా, వీణలు వివరించారు. తిక్రిత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. వారు తమను చంపడానికి తీసుకెళ్తున్నారా? లేక రక్షించడానికి తీసుకెళ్తున్నారా? అన్న విషయం అర్థం కాలేదన్నారు. తిక్రిత్లఆసుపత్రి నుంచి బయటకు వచ్చి బస్సులోకి ప్రవేశించిన కొద్దిసేపటికే తామున్న ఆసుపత్రి భవనంలోని ఒకటో, మూడో అంతస్తులు మంటల్లో చిక్కుకుపోవడం కనిపించిందని సీనా అనే నర్సు వెల్లడించింది. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు. మీకెలాంటి హాని చేయమని మిలిటెంట్లు మాతో చెప్పారని, అయినా, వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని, గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని నర్సులు తెలిపారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలా అనే బెంగ పట్టుకుందన్నారు. కాగా, యూఏఈకి చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్‌నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం ఇస్తానని కేరళ వార్తా పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఈ క్రెడిట్ సుష్మాదే ! న్యూఢిల్లీ: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న కేరళ నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావడం నరేంద్ర మోడీ సర్కారు సాధించిన మొట్టమొదటి దౌత్య విజయంగా భావిస్తున్నారు. ఈ ఘనవిజయానికి మొట్టమొదటి క్రెడిట్ మాత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంక్షోభ నివారణ కోసం ఆమె రాత్రింబవళ్లు పనిచేశారు. నర్సులను క్షేమంగా విడిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా అధికారికంగా గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో, ఢిల్లీలోని ఆ దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. ఇరాక్, సౌదీ అరేబియాలతోనూ ఆమె నిరంతరం సంప్రదింపులు జరిపారు. అనధికారికంగా ఇరాక్ సరిహద్దులుగా ఉన్న సిరియా, జోర్డాన్, టర్కీల్లోని కీలక నేతలతో చర్చలు జరిపి, తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచారని సమాచారం. ‘అంతర్జాతీయంగా భారత్‌కున్న మంచిపేరు సహా అన్ని మార్గాలనూ వాడుకున్నాం’ అని విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. -
'ఆ నర్సులను క్షేమంగా భారత్ కు తీసుకువస్తాం'
తిరువంతపురం:ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులు త్వరలో క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు కేరళ సీఎం ఓమెన్ చాందీ స్పష్టం చేశారు. మిలిటెంట్లు చెరలో చిక్కుకున్నఆ నర్సులకు ఎర్బిల్ ఎయిర్ పోర్ట్ లో క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చాందీ తెలిపారు. మోసూల్ పట్టణంలో కేరళకు చెందిన నర్సులను గురువారం తిరుగుబాటుదారులు అపహరించి బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి అపహరించిన ఆ నర్సులను మిలిటెంట్లు బందించి మోసుల్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉన్న కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ కు తరలించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన 'ఉన్నతస్థాయి వివాదాల కమిటీ' వారిని తిరిగి సురక్షితంగా భారత్ కు రప్పించే పనిలో నిమగ్నమైందని చాందీ తెలిపారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
ఇరాక్ మిలిటెంట్ల చెరలో కేరళ నర్సులు
తిక్రిత్ నుంచి 46 మందిని బలవంతంగా తరలింపు ముగ్గురు నర్సులకు గాయాలు; అంతా క్షేమం: కేరళ సీఎం క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ/తిరువనంతపురం/బాగ్దాద్: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 46 మంది భారతీయ నర్సులను(అంతా కేరళకు చెందినవారే) గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లినదీ కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న మోసుల్ పట్టణం వైపు వెళ్లినట్లు సమాచారముందని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామున బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో ముగ్గురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మానవతావాద సంస్థలను కూడా సంప్రదిస్తున్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ వెల్లడించారు. తమ రాష్ట్ర నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యుల ఆందోళన: ఇరాక్‌లో మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న నర్సుల కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమవారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. తిక్రిత్‌లోని బంగ్లాదేశీయులను ఆ దేశం తరలించిందని, ఆ మాత్రం కూడా మనవారు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఒబామా మంతనాలు: ఇరాక్ సంక్షోభం తీవ్ర కావడంతో.. సంక్షోభ నివారణకు అమెరికా సంప్రదింపులు తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సౌదీ రాజు అబ్దుల్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఇరాక్‌లోని సున్నీల నేత, గత పార్లమెంటు స్పీకర్ అయిన ఒసామా అల్ నుజైఫీతో.. విదేశాంగమంత్రి జాన్ కెర్రీ కుర్దుల నేత మస్సూద్ బర్జానీతో చర్చలు జరిపారు. తూర్పు సిరియాలోనూ మిలిటెంట్ల పట్టు బీరుట్: తూర్పు సిరియాలోని దీర్ ఎజ్ జార్ రాష్ట్రాన్ని గురువారం సున్ని మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిరియాలోని అత్యధిక ప్రాంతం ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని, అది లెబనాన్ భూభాగం కన్నా ఐదురెట్లు ఎక్కువని సిరియాలోని మానవహక్కుల సంస్థ వెల్లడించింది. -
మ్యూజియంలో అనంతుని నిధి నిక్షేపాలు
తిరువనంతపురం : అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో కనుగొన్న నిధినిక్షేపాలను సుప్రీంకోర్టు అనుమతిస్తే మ్యూజియంలో ప్రదర్శించడానికి కేరళ ప్రభుత్వం సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. ఈ తరహా నిధులు ప్రపంచంలో మరెక్కడా లేవని, ట్రావెన్కోర్ మాజీ రాజకుటుంబం ఈ నిధులను ఇప్పటివరకూ కాపాడటం వారి నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసిన రాజకుటుంబాన్ని విమర్శించటం తగదన్నారు. ఆలయ సందపను అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రతినిధి సమర్పించిన నివేదిక తమకు అందలేదని, ఈ కేసు ఆగస్టు 6న కోర్టు ముందుకు విచారణకు రానుందని సీఎం తెలిపారు. -
అనుమతులు ఉపసంహరణ, డీఎల్ఎఫ్ కు ఎదురుదెబ్బ!
తిరువనంతపురం: ప్రతిపక్షాల ఆందోళనకు తలవొంచిన కేరళ ప్రభుత్వం డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు మంగళం పాడింది. నిబంధనలకు విరుద్దంగా కోచి లో డీఎల్ఎఫ్ చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణ పనులు రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టారు. కేవలం లబ్ది పొందడానికే కాంగ్రెస్, యూడీఎఫ్ ప్రభుత్వం డీఎల్ఎఫ్ కు అనుమతిచ్చిందని ప్రతిపక్ష ఎల్ డీఎఫ్ ఆరోపణలు చేసింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పనులను రద్దు చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్దర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి లబ్ది చేకూర్చడానికే డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని, రాజకీయంగా లబ్ది పొందడానికే డీఎల్ఎఫ్ కు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతిచ్చారని ఎల్ డీఎఫ్ ధర్నా నిర్వహించింది. గత ఏప్రిల్ లో పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియరెన్స్ మేరకే ఈ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చామని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, పర్యావరణ శాఖ రాధాకృష్ణన్ నోటిసులకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహరంపై ఐదు రోజులుగా రిపోర్టు సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి చాందీ కోరారు. -
కేజ్రీవాల్ బాటలో కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ... ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దారిలో నడుస్తున్నారు. రాజకీయాలు, పాలన విషయంలో అనుకుంటే పొరబడినట్టు. మీడియాను దుమ్మెత్తిపోయడంలో కేజ్రీవాల్‌ను అనుసరిస్తున్నారు కేరళ సీఎం. సంచలనాల కోసం మీడియా పాకులాడుతోందని ఆయన విమర్శించారు. తన పట్ల మీడియా పారదర్శకంగా వ్యవహరించడం లేదని వాపోయారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వ్యతిరేక ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే మీడియా రాజకీయాలు చేయడం లేదని కేవలం సంచలనాల కోసమే పాకులాడుతోందని అన్నారు. ప్రజలను చేరుకోవడానికి తనకు అనేక మార్గాలున్నాయని చెప్పారు. తన దృష్టంతా అభివృద్ధిపైనే అని ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. సోలార్ స్కామ్‌లో తనకు తాను క్లీన్ చీట్ ఇచ్చుకునే యత్నం చేశారాయన. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెట్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
వీడియో వివాదంలో ‘కుమారుడు’!
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి కుమార్ విశ్వాస్ను కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఆప్‌లోకి అడుగుపెట్టాక ఆయన చేసిన వివాదాస్పదమైన చర్యలేవీ లేకపోయినా ఎప్పుడో.. ఓ కవి సమ్మేళనంలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య తాలూకు వీడియో ఆయననిప్పుడు ఇబ్బందులోకి నెట్టింది. మళయాళీ నర్సులకు సంబంధించి 2008లో రాంచీలో జరిగిన ఓ కవి సమ్మేళనంలో కుమార్ విశ్వాస్ చేసిన ప్రసంగం తమను అవమాన పరిచేలా ఉందంటూ కేరళలో పెద్దపెట్టున ఆందోళనలు జరిగాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కల్పించుకొని, ఆప్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కుమార్ విశ్వాస్ ఆ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఓ పాత వీడియోలో తాను చేసిన ప్రసంగం కేరళవాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘కులం, మతం, ప్రాంతం, లింగ, జాతి వివక్షపూరితమైన వ్యాఖ్యలు, చర్యలను నేనెప్పుడూ సమర్థించను. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు నేనెప్పుడూ ప్రయత్నించను. నా వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నా మాటలు కేరళలో ఉంటున్న నా స్నేహితుల మనోభావాలను దెబ్బతీశాయనే విషయం నా దృష్టికి రావడంతోనే నేనీ క్షమాపణ చెబుతున్నా. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాన’ని చెప్పినట్లు ఆప్ ప్రకటించింది. కేరళ విభాగానికి చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. దీంతో మొత్తానికి ‘కుమారుడు’ బతికి బయటపడ్డాడు. -
'కారు రాలేదు..సీఎం టాక్సీ ఎక్కి వెళ్లాడు'
అనుకున్న సమయానికి ముఖ్యమంత్రిని తీసుకువెళ్లడానికి వాహనం రాలేదు. దాంతో వేచి చూడటం ఇష్టం లేక ముఖ్యమంత్రి చేత్తో ఓ సైగ చేసి వచ్చిన కారులో ఎక్కి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఎదురైంది. దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకున్న ఉమెన్ చాందీని తీసుకువెళ్లాడానికి అనుకున్న సమయానికి వాహనం...విమానాశ్రాయానికి చేరలేకపోయింది. దాంతో అధికార వాహనం కోసం వేచి చూడటం ఇష్టం లేక ప్రైవేట్ టాక్సీలో తన కార్యాలయాన్ని చేరుకున్నారు. ముఖ్యమంత్రి టాక్సీలో వెళ్లడం భద్రత పరమైన లోపాలంటూ కేరళ రాజధాని తిరువనంతపురంలో పెద్ద దుమారాన్నే లేపింది. అయితే అలాంటిదేమి లేదని.. భద్రతాపరమైన సమస్య కానే కాదు. నేను ఢిల్లీలో కూడా ప్రైవేట్ వాహనంలోనే ప్రయాణిస్తాను అని చాందీ అన్నారు. అయితే ఈ విషయాన్ని కేరళ పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. వాహనం సకాలంలో ఎందుకు చేరలేదని అంశంపై విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని పెద్ద సమస్యగా చూడవద్దని.. అనుకున్న సమయం కంటే ముందుగా విమానం తిరువనంతపురానికి చేరుకోవడం కారణంగానే తాను టాక్సీలో కార్యాలయంలో చేరుకున్నాను అని చాందీ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఢిల్లీ విమానం 10.50 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా, 10.18 నిమిషాలకే తిరువనంతపురానికి చేరుకుంది. ఈ విషయంపై అనవసర రాద్దాంతం చేయవదు అని కేరళ స్టేట్ కాంగ్రెస్ చీఫ్ రమేశ్ చెన్నితల మీడియాకు విజ్క్షప్తి చేశారు. -
ఎంపీ ప్రవర్తనపై కేరళ సీఎంకు శ్వేతా మీనన్ ఫిర్యాదు
కాంగ్రెస్ ఎంపీ తన పట్ల అసభ్యకరం ప్రవర్తించిన సంఘటనపై మలయాళ నటి శ్వేతా మీనన్ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలిశారు. కేసుకు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆమె చెప్పారు. కొల్లాంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, 73 ఏళ్ల పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా మీనన్ ఆరోపించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె ఎంపీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం ఉపసంహరించుకున్నారు. -
కేరళ సీఎం కారుపై దాడి
కన్నూర్ (కేరళ): కేరళలోని సోలార్ ప్యానెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఆదివారం చేపట్టిన నిరసనలు హింసాకాండకు దారితీశాయి. ఎల్డీఎఫ్ కార్యకర్తల రాళ్ల దాడిలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి గాయాలయ్యాయి. కన్నూర్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చాందీ పోలీసు మైదానం వద్దకు వస్తుండగా, ఈ సంఘటన జరిగింది. భారీ బలగాలను మోహరించినా, నిరసన కొనసాగిస్తున్న ఎల్డీఎఫ్ కార్యకర్తలు సభా వేదిక వైపు దూసుకొచ్చి, మైదానంలోకి వస్తున్న చాందీ కారుపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల తాకిడికి కారు అద్దాలు పగిలి, చాందీకి కుడి కంటికి ఎగువన నుదుటిపై స్వల్ప గాయాలయ్యాయి. చాందీపై రాళ్ల దాడిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎం అప్రజాస్వామిక వైఖరిని అవలంబిస్తోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని దుయ్యబట్టాయి. తనపై దాడి జరిగినా, చాందీ వెనక్కి మళ్లకుండా, పోలీసు మైదానంలో ఏర్పాటైన కేరళ పోలీసు క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కేరళ హోంమంత్రి తిరువాంచూర్ రాధాకృష్ణన్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంఘటనా స్థలం వద్దనే ఉన్న డీజీపీ కె.ఎస్.బాలసుబ్రమణ్యన్ను ఆదేశించారు. మరోవైపు, చాందీపై దాడికి వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లోనూ నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న చాందీ మాట్లాడుతూ, ఇలాంటి హింసాకాండతో కాంగ్రెస్‌ను ఎవరూ బలహీనపరచలేరని అన్నారు. కన్నూర్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు తరచు దాడులను ఎదుర్కొంటున్నారని, వారి ఇక్కట్లతో పోలిస్తే, తనపై జరిగిన దాడి చిన్నదేనన్నారు.