కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు.
తిరువనంతపురం: కేరళలో తాజాగా మరో 11 మంది హిందూ మతంలోకి మారారు. అలప్పుజా జిల్లా కాయంకుళం దగ్గర్లోని కేశవూర్ ఆలయంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మంది బుధవారం వీహెచ్‌పీ చొరవతో హిందూమతం స్వీకరించారు. ఇదే జిల్లాలో ఈ నెల 21న 30 మంది ఎస్సీ క్రైస్తవులు హిందూ మతం పుచ్చుకోవడం తెలిసిందే. కాగా, కేరళలో బలవంతపు మతమార్పిళ్లు జరగడంలేదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. మరోవైపు జనవరి 4న రాజస్థాన్‌లోని ఝుంఝునులో క్రైస్తవ కుటుంబాలను హిందూ మతంలోకి మారుస్తామని వీహెచ్‌పీ ప్రకటించింది.